వన్డేల్లో రోహిత్ శర్మ 24వ సెంచరీ: పాక్ విజయ లక్ష్యం 337

ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. దీంతో పాకిస్తాన్ ముందు 337 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు అదిరే ఆరంభం లభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడుతూ స్కోర్ వేగాన్ని పెంచారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

హాఫ్ సెంచరీలు:
'హిట్ మ్యాన్' రోహిత్ శర్మ సిక్సులు, ఫోర్లతో చెలరేగాడు. పాక్ బౌలర్ షాదాబ్ ఖాన్ వేసిన 12వ ఓవర్ చివరి రెండు బంతులను సిక్స్, ఫోర్ బాది హాఫ్ సెంచరీ చేసాడు. కేవలం 35 బంతుల్లో 6 ఫోర్లు, రెండు సిక్సర్లతో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. అయితే హాఫ్ సెంచరీ అనంతరం కొంచెం దూకుడు తగ్గించాడు. కేవలం సింగిల్స్ తీస్తూ స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. మొదటగా ఆచితూచి ఆడిన రాహుల్.. అనంతరం గేర్ మార్చి పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే మాలిక్ వేసిన 21.4 బంతిని సిక్స్ కొట్టి హాఫ్ సెంచరీ అందుకున్నాడు.
రోహిత్ సెంచరీ:
ఇక వాహబ్ వేసిన 23.5 బంతిని రాహుల్ (57; 78బంతుల్లో 3×4, 2×6) షాట్ ఆడి బాబర్ అజామ్ చేతికి చిక్కాడు. దీంతో 136 పరుగుల తొలి వికెట్ కు తెరపడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ.. రోహిత్‌కు మంచి సహకారం అందించాడు. బౌండరీలు బాదుతూ రోహిత్ ఈ ప్రపంచకప్‌లో రెండో సెంచరీ నమోదు చేశాడు. అయితే 140 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హసన్ అలీ బౌలింగ్‌లో రియాజ్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. 113 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 140 పరుగులు చేశాడు.
బ్యాట్ ఝళిపించిన పాండ్యా:
అనంతరం క్రీజులోకి వచ్చిన పాండ్యా బ్యాట్ ఝళిపింఛాడు. 19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 26 పరుగులు చేశాడు. అయితే ధోనీ ఒక్క పరుగుకే ఔట్ అయి నిరాశపరిచాడు. ఈ సమయంలో (46.4 ఓవర్లలో 305/4 వద్ద) వర్షం ప్రారంభం కావడంతో మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిచిపోయింది. వెంటనే తగ్గిపోవడంతో.. తిరిగి ప్రారంభమయ్యాక కోహ్లీ (77) అవుటయ్యాడు. చివర్లో విజయ్ శంకర్ 15, కేదార్ జాదవ్ 9 పరుగులు చేయడంతో భారత్ 336 పరుగులు చేసింది. పాకిస్థాన్ బౌలర్లలో మహ్మద్ ఆమిర్ 3 వికెట్లు తీసాడు.
{headtohead_cricket_3_5}
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications