For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ చేతిలో ఓటమి.. పాక్‌ జట్టును నిషేధించాలంటూ పిటిషన్‌

ICC Cricket World Cup 2019 : Man Files Petition On Pak Cricket Team After Defeat To India
CWC 19, India vs Pakistan: Pakistan Fan Files Petition To Ban Pak Cricket Team After Defeat To India

ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం భారత్‌ చేతిలో పాకిస్థాన్ చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. పాక్‌ ఓటమిని ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక సోషల్‌ మీడియాలో అయితే పాక్ అభిమానులు ఆ దేశ ఆటగాళ్లపై మీమ్స్, జోక్స్ పేల్చుతున్నారు. ముఖ్యంగా పాక్ కెప్టెన్ సర్ఫరాజ్, సెలక్షన్‌ కమిటీని ఓ ఆటాడుకుంటున్నారు. ఓ అభిమాని ఏకంగా పాక్‌ జట్టును నిషేధించాలంటూ పిటిషన్‌ వేసాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

మ్యాచ్‌ ఓటమికి జట్టుతో పాటు సెలక్షన్‌ కమిటీ కూడా బాధ్యత వహించాలని పంజాబ్‌ ప్రావిన్స్‌లోని గుజ్రన్‌వాలా సివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. పాక్‌ జట్టు, చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌పై నిషేధం విధించాలని ఆ అభిమాని పిటిషన్‌లో పేర్కొన్నాడు. సివిల్‌ కోర్టు న్యాయమూర్తి ఈ పిటిషన్‌ను విచారించాడు. అనంతరం ఈ విషయంపై నివేదికలు అందించాల్సిందిగా పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)కు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం పీసీబీ సమావేశం కానుంది.

మాంచెస్టర్‌ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ 89 పరుగులతో ఓటమిని చవిచూసింది. దీంతో భారత్‌పై ప్రపంచకప్‌లో వరుసగా ఏడో ఓటమిని ఎదుర్కొంది. ఇక పాకిస్థాన్‌ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడగా.. ఒక విజయం, మూడు ఓటములను చవిచూసింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ప్రస్తుతం పాక్ 3 పాయింట్లతో పాయింట్ల పట్టికలో దిగువ నుండి రెండవ స్థానంలో ఉంది. సెమీస్‌కి చేరాలంటే పాక్ మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో తప్పక విజయం సాదించాలి.

Story first published: Wednesday, June 19, 2019, 14:50 [IST]
Other articles published on Jun 19, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+