Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హాఫ్ సెంచరీ చేసి రాహుల్ నిష్క్రమణ..

CWC 19, India vs Pakistan: Openar KL Rahul falls after fifty, Virat Kohli in Crease

ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్‌ వేదికగా దాయాదులు భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్‌ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మాలిక్‌ వేసిన 21.4 బంతిని సిక్స్‌ కొట్టి హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. మొదటగా ఆచితూచి ఆడిన రాహుల్.. అనంతరం గేర్ మార్చి పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ చేసాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

22వ ఓవర్ ఐదో బంతిని సిక్సర్‌గా మలిచిన రాహుల్ (57; 78బంతుల్లో 3×4, 2×6).. వాహబ్‌ వేసిన 23.5 బంతిని షాట్‌ ఆడి బాబర్‌ అజామ్‌ చేతికి చిక్కాడు. దీంతో 136 పరుగుల తొలి వికెట్ కు తెరపడింది. అయితే మరో ఓపెనర్ రోహిత్ మాత్రం పరుగుల వరద పారిస్తున్నాడు. సెంచరీకి దగ్గరలో ఉన్నాడు. అతనికి కెప్టెన్ కోహ్లీ సహకారం అందిస్తున్నాడు. 27 ఓవర్లు సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 160 పరుగులు చేసింది. ప్రస్తుతం రోహిత్‌ (92), కోహ్లీ (6)లు క్రీజులో ఉన్నారు.

ఈ మ్యాచ్‌లో టీమిండియా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ప్రపంచకప్‌ చరిత్రలో పాకిస్తాన్‌పై అత్యధిక ఓపెనింగ్‌ పరుగుల భాగస్వామ్యాన్ని భారత్‌ సాధించింది. భారత ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌లు వంద పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పారు. గతంలో పాక్‌పై భారత్‌ అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం 90.

1
43665

{headtohead_cricket_3_5}

Story first published: Sunday, June 16, 2019, 17:06 [IST]
Other articles published on Jun 16, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+