Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమీండియా ఓటమిపై రోహిత్‌ స్పందన.. నా హృదయం భారంగా ఉంది

ICC Cricket World Cup 2019 : 'My Heart Is Heavy As I'm Sure Yours Is Too Says Rohit Sharma
CWC 19, India vs New Zealand: Failed to deliver as a team, Rohit Sharma reacts to Indias loss against New Zealand

బుధవారం మాంచెస్టర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి నాకౌట్‌లో టీమిండియా 18 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమిపై టీమీండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటికే వివరణ ఇవ్వగా.. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ తొలిసారి స్పందించాడు. గురువారం రాత్రి తన అధికారిక ట్విటర్‌ వేదికగా భావోద్వేగపూరిత పోస్టు చేసాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

జట్టుగా విఫలమయ్యాం:

'కీలక సమయంలో జట్టుగా ఆడటంలో విఫలమయ్యాం. కేవలం 30 నిమిషాల పేలవ ఆటతీరు ప్రపంచకప్‌ అవకాశాన్ని కోల్పోయేలా చేసింది. ప్రస్తుతం నా హృదయం భారంగా ఉంది. నాలాగే మీరు కూడా బరువైన హృదయాలతో ఉన్నారని తెలుసు. ఇంగ్లాండ్‌ గడ్డపై భారత అభిమానుల స్పందన అమోఘం. భారత్ ఆడిన ప్రతీచోట ఇంగ్లాండ్‌ను నీలం రంగులో మార్చినందుకు అందరికీ ధన్యవాదాలు' అని రోహిత్ రాసుకొచ్చాడు. ఈ టోర్నీలో రోహిత్‌ (648) టాప్ స్కోరర్.

ఐదు సెంచరీలు:

ఐదు సెంచరీలు:

ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఐదు సెంచరీలు చేసాడు. దీంతో రోహిత్ శర్మ ఓ కొత్త రికార్డును నెలకొల్పాడు. ఒక ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. నాలుగు సెంచరీలతో ఈ జాబితాలో ఉన్న శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర రికార్డును రోహిత్ శర్మ బద్దలుగొట్టాడు. 2015 ప్రపంచకప్‌‌లో కుమార సంగక్కర నాలుగు సెంచరీలు సాధించాడు.

నాకౌట్‌లో ఒక పరుగు:

నాకౌట్‌లో ఒక పరుగు:

240 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమయింది. 14 పరుగులకే రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌లు పెవిలియన్ చేరారు. దినేష్ కార్తీక్ (6) కూడా వెనుతిరగడంతో టీమిండియా గెలుపు అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. పంత్ (32) , పాండ్యా (32 )కొద్దిసేపు క్రీజులో ఉన్నా.. అనవసర షాట్లు ఆడి ఔట్ అయ్యారు. అనంతరం రవీంద్ర జడేజా (77), ఎంఎస్ ధోనీ (50) పోరాడినా.. కీలక సమయంలో ఇద్దరూ ఔట్ అవ్వడంతో భారత జట్టుకు ఓటమి తప్పలేదు. అన్ని మ్యాచుల్లో చెలరేగిన రోహిత్.. కీలక నాకౌట్‌లో చేతులెత్తేశాడు.

Story first published: Friday, July 12, 2019, 19:59 [IST]
Other articles published on Jul 12, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+