భారత్, న్యూజిలాండ్ సెమీస్.. 91 సెకన్లలోనే ఓవర్ పూర్తి చేసిన జడేజా

భారత స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా అత్యంత తక్కువ సమయంలో ఓవర్‌ను పూర్తి చేస్తాడు. గతంలో ఎన్నో సార్లు త్వరగానే ఓవర్‌ను పూర్తి చేసిన జడేజా.. ప్రపంచకప్‌లో కూడా పూర్తి చేసాడు. కేవలం 91 సెకన్లలోనే ఓవర్ పూర్తి చేసి ఔరా అనిపించాడు. మామూలుగా ఏ ఫాస్ట్ బౌలర్ అయినా ఓవర్ వేయడానికి 4-5 నిమిషాల మధ్య సమయం తీసుకుంటారు. అదే ఒక స్పిన్నర్ ఓవర్ పూర్తిచేయడానికి 3 నిమిషాలకు పైనే పడుతుంటుంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
కానీ రవీంద్ర జడేజా మాత్రం 2 నిమిషాల్లోపే ఓవర్ వేసిన సందర్భాలూ ఉన్నాయి. జడేజా తరచుగా రెండు రెండున్నర నిమిషాల్లో ఓవర్ వేస్తాడు. అయితే కివీస్‌తో సెమీస్‌లో జడేజా ఒక నిమిషం 31 సెకన్లలోనే ఒక ఓవర్ పూర్తి చేయడం విశేషం. కివీస్ బ్యాటింగ్ చేస్తుండగా.. 25వ ఓవర్‌ను 91 సెకన్లలోనే వేసాడు. ఈ ఓవర్‌లో కివీస్ బ్యాట్స్‌మెన్ ఐదు బంతులు డిఫెన్స్ ఆడి.. ఒక బంతికి సింగల్ తీశారు. ఈ సమయంలో విలియమ్సన్, టేలర్‌లు క్రీజులో ఉన్నారు. టెస్ట్ మ్యాచ్‌లో సాధ్యమయినా.. వన్డే మ్యాచ్‌లో ఇంత తక్కువ వ్యవధిలో ఓవర్ పూర్తి చేయడం చాలా అరుదు. ఈ మ్యాచ్‌లో జడేజా తన కోటా 10 ఓవర్లలో ఒక వికెట్ తీసి 34 పరుగులు ఇచ్చాడు.
ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం భారత్, న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో రిజర్వ్‌డే (బుధవారం)కు వాయిదా పడింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ మరో నాలుగు ఓవర్లలో ముగుస్తుందనుకున్న సమయంలో చిరుజల్లులతో మొదలైన వర్షం అనంతరం భారీగా పడడంతో మ్యాచ్ నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. ఇక పలు మార్లు వర్షం వచ్చి వెళుతుండడంతో అంపైర్లు మ్యాచ్‌ను బుధవారంకు వాయిదా వేశారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. క్రీజులో రాస్ టేలర్ (67), లాథమ్ (3)లు ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు న్యూజిలాండ్ బ్యాటింగ్‌తో మ్యాచ్ మొదలవుతుంది.
{headtohead_cricket_3_4}
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications