న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ ఓటమికి జెర్సీనే కారణమన్న ముఫ్తి.. మండిపడుతున్న నెటిజన్లు

CWC 19: India vs England: Orange Jersey ended Indias winning streak, Mehbooba Mufti on World Cup loss

బర్మింగ్‌హామ్ వేదికగా ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఆరెంజ్‌ జెర్సీతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ 31 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ క్రమంలో మెగాటోర్నీలో భారత్‌ తొలి ఓటమికి జెర్సీ రంగే కారణం అంటూ కొంతమంది నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగుతున్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ క్రమంలో జమ్ము కశ్మీర్‌ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తి కూడా టీమిండియా ఓటమిపై స్పందించారు. 'నన్ను మూఢనమ్మకస్తురాలు అనుకున్నా పర్లేదు. ప్రపంచకప్‌లో టీమిండియా ఓటమికి జెర్సీనే కారణం' అని ముఫ్తి ట్వీట్‌ చేశారు. అంతకుముందు 'ఇంగ్లండ్‌పై టీమిండియా గెలవాలని పాక్ అభిమానులు కోరుకుంటున్నారు. క్రికెట్‌ కారణంగానైనా రెండు దేశాలు ఒకే తాటిపైకి వచ్చాయి' అని ముఫ్తి ట్వీటింది.

ముఫ్తి ట్వీట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. పాకిస్తాన్‌ కోసమే మీరు ఇలా మాట్లాడుతున్నారు, ఎన్నికల్లో మీరు ఏ రంగు జెర్సీ ధరించారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ముఫ్తిపై జమ్ము బీజేపీ చీఫ్‌ రవీందర్‌ రైనా మండిపడ్డారు. 'పాకిస్తాన్‌ గెలుపు కోసం ముఫ్తి ఆరాటపడుతోంది. భారత జట్టుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు' అని అన్నారు.

'జెర్సీ కారణంగానే భారత్‌ ఓడిపోయిందా. పాకిస్తాన్‌ ఆకుపచ్చ జెర్సీనే ధరిస్తుంది కదా. మరి వాళ్లెందుకు ఓడిపోతున్నారు? అని ప్రశ్నించారు. మత గురువుల్లా పొడవాటి గడ్డాలు పెంచుతున్నందుకే వారు ఓడిపోతున్నారామో!!. భారత్‌ పేరును నాశనం చేసేందుకే కొంత మంది ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారు' అని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

1
43681

{headtohead_cricket_3_2}

Story first published: Monday, July 1, 2019, 14:24 [IST]
Other articles published on Jul 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X