
బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమికి బ్యాట్స్‌మన్‌లు ఎంఎస్ ధోనీ-కేదార్ జాదవ్‌లే కారణమంటూ అటు అభిమానులతో పాటు ఇటు మాజీ క్రికెటర్లు సైతం తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
338 పరుగుల లక్ష ఛేదనలో ఓపెనర్ రాహుల్ త్వరగానే పెవిలియన్ చేరినా.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (109 బంతుల్లో 102; 15 ఫోర్లు), కెప్టెన్ విరాట్ కోహ్లీ (76 బంతుల్లో 66; 7 ఫోర్లు)లు ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. హాఫ్ సెంచరీ అనంతరం కోహ్లీ నిహక్రమించినా.. రోహిత్ సెంచరీ చేసి ఔట్ అయ్యాడు. అనంతరం ధోనీ అండతో హార్దిక్ పాండ్యా (33 బంతుల్లో 45; 4 ఫోర్లు) బాగానే కష్టపడ్డాడు. చివరకు పాండ్యా భారీ షాట్ ఆడి వెనుదిరగాడు.
ఇక భారత్ 30 బంతుల్లో 71 పరుగులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ దశలో క్రీజులో ఉన్న ధోనీ (31 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్), జాదవ్ (13 బంతుల్లో 12 నాటౌట్)లు హిట్టింగ్ చేయకుండా.. కేవలం సింగిల్స్‌పైనే దృష్టిపెట్టారు. కొన్నిసార్లు బంతిని బ్యాట్‌కు కనీసం తాకించలేక పోయారు. మధ్య ఓవర్ల తరహాలో సింగిల్స్ తీస్తూ ఆగ్రహం తెప్పించారు. మ్యాచ్ చూసే భారత అభిమాని అయితే ఇగ షాట్ ఆడుతాడు అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసారు. అయినా స్లో బ్యాటింగ్‌తో విసుగు తెప్పించారు.
31 బంతుల్లో 71 పరుగులు చేయాల్సిన దశలో ధోనీ-జాదవ్‌లు 7 డాట్ బాల్స్, 20 సింగిల్స్, 3 ఫోర్లు, 1 సిక్స్ కొట్టారు. చేతిలో ఐదు వికెట్ల ఉండి కూడా భారీ షాట్లకు ప్రయత్నించకపోవడం ఆశ్యర్యానికి గురిచేసిందని మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. వీరి బ్యాటింగ్ చూసి అబిమానులు కాదు కామెంటేటర్‌లు కూడా ఆశ్చర్యపోయారు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ నాసర్ హుస్సెన్ అయితే ఈ బ్యాటింగ్ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ కూడా ఈ జోడిని తప్పుబట్టాడు. వీరి ఆట చూసి ఓడిపోతామని ఫిక్స్ అయి కొందరు అభిమానులు మైదానంను కూడా వీడారు.
{headtohead_cricket_3_2}