Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. జట్టులోకి రిషబ్ పంత్

CWC 19: India vs England Match: England have won the toss and have opted to bat

ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో ఆతిథ్య ఇంగ్లండ్‌, భారత్‌ జట్ల మధ్య మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఒక మార్పు చేసింది. వరుసగా విఫలమవుతున్న విజయ్ శంకర్ స్థానంలో రిషబ్ పంత్ జట్టులోకి వచ్చాడు. పంత్ కు ఇదే తొలి ప్రపంచకప్‌ మ్యాచ్. మరోవైపు ఇంగ్లండ్‌ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌, పేసర్ లియామ్ ప్లంకెట్ జట్టులోకి వచ్చారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఇప్పటికే దాదాపుగా సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకున్న భారత్‌.. ఈ మ్యాచ్‌లో గెలిస్తే అధికారికంగా సెమీస్‌కు చేరుకుంటుంది. మరోవైపు టోర్నీలో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగి.. అనూహ్య పరాజయాలతో సెమీస్‌ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకున్న ఇంగ్లాండ్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకం. సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్‌లలో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. అయితే ఈ మ్యాచ్‌ ఓడితే ఇంగ్లాండ్‌ సెమీస్‌ అవకాశాలు మరింత తగ్గుతాయి. దీంతో ఒత్తిడంతా ఇంగ్లాండ్‌పైనే ఉంది.

ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 99 మ్యాచ్‌లు జరగ్గా.. భారత్‌ 53 మ్యాచ్‌ల్లో నెగ్గింది. 41 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ విజయం సాధించింది. రెండు టై కాగా.. మూడింట్లో ఫలితం తేలలేదు. ప్రపంచ కప్‌లో భాగంగా ఏడు మ్యాచ్‌ల్లో తలపడగా.. చెరో మూడింట్లో నెగ్గాయి. ఒకటి 'టై'గా ముగిసింది. 2011లో భారత్‌ వేదికగా జరిగిన కప్‌లో 338 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ సమం చేసింది.

మ్యాచ్‌కు వేదికైన ఎడ్జ్‌బాస్టన్‌ మైదానం పిచ్‌ టోర్నీలోనే బ్యాటింగ్‌కు అత్యంత అనుకూలమైనది. ఇరు జట్లను చూస్తే భారీ స్కోర్లు ఖాయం. 2015లో ఇదే మైదానంలో ఇంగ్లండ్‌ జట్టు 400పైగా స్కోరు సాధించింది. అయితే తాజాగా ఇక్కడ జరిగిన రెండు మ్యాచ్‌ల్లో 245 పరుగులే అత్యధికం. ఈ రెండు సార్లు కూడా ఛేజింగ్‌ జట్టే గెలిచింది. మ్యాచ్ సాగే కొద్దీ పిచ్ స్పిన్నర్లకు కూడా అనుకూలించనుంది.

1
43681

{headtohead_cricket_3_2}

తుది జట్లు:
భారత్
: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రిషబ్ పంత్, ఎంఎస్ ధోనీ, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా , కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, యుజువేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా.

ఇంగ్లండ్: జేసన్ రాయ్, జాన్నీ బెయిర్‌స్టో, జోయ్ రూట్, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, లియామ్ ప్లంకెట్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్.

Story first published: Sunday, June 30, 2019, 14:45 [IST]
Other articles published on Jun 30, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+