Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ రివ్యూ సిస్టమ్‌ ఫెయిల్.. అభిమానుల మండిపాటు

CWC 19: India vs England: DRS No Longer Dhoni Review System? Fans Lash Out After Wrong Call Lets Jason Roy Escape

పాకిస్తాన్ అంపైర్ అలీమ్ దార్ తప్పుడు నిర్ణయం, ఎంఎస్ ధోనీ రివ్యూ సిస్టమ్‌ ఫెయిల్ అవ్వడం, కెప్టెన్ విరాట్ కోహ్లీ రివ్యూ తీసుకోకపోవడంతో.. ఆదివారం బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్‌ను 20 పరుగుల వద్ద అవుట్ చేసే భారీ అవకాశాన్ని భారత్ కోల్పోయింది. ఫలితంగా భారత్ మూల్యం చెల్లించుకుంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అప్పీల్‌ చేసినా:

అప్పీల్‌ చేసినా:

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో హార్దిక్‌ పాండ్యా వేసిన 11వ ఓవర్‌ ఐదో బంతిని జేసన్‌ రాయ్‌ లెగ్ సైడ్ షాట్ ఆడగా.. బంతి కాస్తా అతని కుడి చేతి గ్లోవ్‌ను తాకుతూ కీపర్‌ ధోనీ చేతిలో పడింది. వెంటనే భారత ఆటగాళ్లు అప్పీల్‌ చేసినా.. అంపైర్‌ వైడ్‌గా ప్రకటించాడు. కోహ్లీ, హార్దిక్‌లు క్యాచ్‌గా భావించినప్పటికి.. కీపర్ ధోనీ నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో కోహ్లీ రివ్యూ తీసుకోలేదు.

స్పైక్‌లో స్పష్టంగా:

అనంతరం రిప్లేలో బంతికి రాయ్‌ గ్లోవ్‌ను తాకినట్లు స్పష్టంగా తేలింది. స్నికోలోని స్పైక్‌ కూడా స్పష్టం చేసింది. అప్పటికి ఇంగ్లండ్‌ స్కోర్‌ 49 కాగా.. జేసన్‌ రాయ్‌ 20 పరుగులే చేశాడు. భారత్ రివ్యూ తీసుకోకపోవడంతో బతికిపోయిన రాయ్ తర్వాతి బంతిని సిక్స్ కొట్టాడు. అనంతరం మరింత రెచ్చిపోయిన రాయ్‌.. 57 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్స్‌లతో 66 పరుగులు చేసాడు. అంతేకాదు తొలి వికెట్‌కు 160 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. అక్కడే రాయ్ ఔట్ అయి ఉంటే 49 పరుగుల భాగస్వామ్యానికి ముగింపు పడి ఇంగ్లండ్‌పై ఒత్తిడి నెలకొనేది.

లెక్క తప్పాడు:

లెక్క తప్పాడు:

డీఆర్‌ఎస్‌ అంటేనే ధోనీ రివ్యూ సిస్టమ్‌గా పేరున్న ధోనీ.. ఈ రివ్యూలో వైఫల్యం చెందాడు. దీంతో అభిమానులు ధోనీపై మండిపడుతున్నారు. ధోనీ రివ్యూ సిస్టమ్‌ ఫెయిల్ అయింది, ధోనీ లెక్క తప్పాడు, ఇంకా ఎంతకాలం పనిచేస్తుంది ధోనీ రివ్యూ సిస్టమ్‌, రివ్యూ-బ్యాటింగ్ రెండిట్లో ధోనీ విఫలం అంటూ మండిపడుతున్నారు. ధోనీ లెక్కతప్పడం ఈ ప్రపంచకప్‌లో ఇది రెండో సారి. బాబర్ ఆజామ్ విషయంలో కూడా విఫలమయ్యాడు. కోహ్లీ రివ్యూ తీసుకుంటా అని అన్నా.. వద్దు అని సూచించాడు.

రోహిత్‌ శర్మ మద్దతు:

రోహిత్‌ శర్మ మద్దతు:

అయితే ధోనీకి రోహిత్‌ శర్మ మద్దతు పలికాడు. 'స్పష్టత లేనప్పుడు డీఆర్‌ఎస్‌ అనేది క్లిష్టమైనది. రాయ్‌ విషయంలో కూడా బాల్‌ తాకినట్లు కొంతమందికి వినబడింది, మరికొంతమందికి వినబడలేదు. డీఆర్‌ఎస్‌ విషయంలో ధోనీ అంచనాలు ఫలితాన్నిస్తాయి కాబట్టి ధోనీ నిర్ణయంవైపు కోహ్లీ మొగ్గు చూపాడు. అంచనా తప్పయింది. ఈ విషయంలో సర్కిల్‌ లోపల ఉన్న ఫీల్డర్లే భిన్న వాదనలు వినిపించడంతో కోహ్లీ వెనకడుగు వేసాడు' అని రోహిత్ పేర్కొన్నాడు.

1
43681

{headtohead_cricket_3_2}

Story first published: Monday, July 1, 2019, 15:57 [IST]
Other articles published on Jul 1, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+