ధోనీ పౌరసత్వాన్ని మార్చుకుంటే.. న్యూజిలాండ్ సెలక్షన్ కమిటీకి సిఫారుసు చేస్తా

మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ తన పౌరసత్వాన్ని మార్చుకుంటే.. న్యూజిలాండ్ సెలక్షన్ కమిటీకి సిఫారుసు చేస్తా అని కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నారు. బుధవారం మాంచెస్టర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి నాకౌట్‌లో టీమిండియా 18 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. లక్ష్య ఛేదనలో ధోనీ (50; 72 బంతుల్లో 1x4, 1x6) జడేజాతో (77; 59 బంతుల్లో 1x4, 1x6) కలిసి పోరాడినా మ్యాచ్ చేజారింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

స్లో స్ట్రైక్ రేట్:
ఈ ప్రపంచకప్‌లో భారత జట్టును ధోనీ చాలా సార్లే ఆదుకున్నాడు. అయితే ఆఫ్ఘానిస్తాన్, ఇంగ్లాండ్ మ్యాచ్‌ల స్ట్రైక్ రేట్ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ మ్యాచుతో ధోనీ ధాటిగా బ్యాటింగ్ చేయకపోవడంతో ఈ విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. సెమీస్ మ్యాచ్‌లో కూడా కీలక ఇన్నింగ్స్ ఆడినా విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ధోనీ గతంలో మాదిరిగా వేగంగా ఆడలేకపోతున్నాడు ఇక రిటైర్మెంట్ తీసుకోవాలని విమర్శలు వచ్చాయి.

పౌరసత్వాన్ని మార్చుకుంటే:
ఈ నేపథ్యంలో విలియమ్సన్ స్పందించాడు. 'ప్రస్తుతం ధోనీకి మాతో కలిసి ఆడే అవకాశం లేదు. ధోనీ మాతో కలిసి ఆడాలనకుంటే తన పౌరసత్వాన్ని మార్చుకోవాలి' అని సరదాగా వ్యాఖ్యానించాడు. ఇంకా విలియమ్సన్ మాట్లాడుతూ... 'ధోనీ ప్రపంచ స్థాయి ఆటగాడు. అతను ఓ గొప్ప కెప్టెన్. అతని అనుభవం జట్టుకు చాలా అవసరం. గత మ్యాచ్, ఈ మ్యాచ్‌లో అతని భాగస్వామ్యం అద్భుతం' అని పేర్కొన్నారు.

విలువైన ఆటగాడు:
'ధోనీ టోర్నీ మొత్తం బాగా ఆడాడు. కీలక సమయంలో జడేజాతో ధోనీ భాగస్వామ్యం అమోగం. రెండు జట్లలోని ఆటగాళ్ల అందరికంటే అతను బంతిని బాగా కొట్టగలడు. చాలా విలువైన ఆటగాడు. ఇటీవల కాలంలో ధోనీపై వస్తున్న విమర్శలు బాధాకరం. ధోని తన పౌరసత్వాన్ని మార్చుకుంటే అతన్ని తీసుకోవాలంటూ మా సెలక్షన్ కమిటీకి సిఫారుసు చేస్తా' అని విలియమ్సన్ అన్నారు.

క్లారిటీ లేదు:
ధోనీ భారత క్రికెట్‌లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు అందించిన ధోనీ.. గత కొంతకాలంగా రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచకప్-2019 అనంతరం రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ ఊహించారు. కప్ గెలిచి ధోనీ ఘనంగా వీడ్కోలు తీసుకోవాలని అభిమానులు ఆశించారు. కానీ సెమీస్‌లోనే భారత్ ఇంటిదారి పట్టింది. రిటైర్మెంట్ ప్రకటించడం లాంఛనమే అయినా.. ధోనీ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications