Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐసీసీ ర్యాంకింగ్స్‌: టాప్‌లోనే కోహ్లీ, బుమ్రా.. 24 స్థానాలు ఎగబాకిన జడేజా

ICC Rankings : Virat Kohli, Jasprit Bumrah Retain Top Spots In ICC ODI Rankings || Oneindia Telugu
CWC 19: ICC announces the ODI rankings after 2019 World Cup, Virat kohli and Jasprit Bumrah remains on top

ప్రపంచకప్‌ అనంతరం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేసర్ జఫ్రీత్ బుమ్రాలు అగ్రస్థానంలో నిలిచారు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబ‌ర్‌వ‌న్ బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ.. నెంబ‌ర్‌వ‌న్ బౌలర్‌గా బుమ్రా తమ టాప్ ప్లేస్‌లను నిలబెట్టుకున్నారు. ఇక ఫైనల్ చేరిన ఇంగ్లాండ్, కివీస్‌ ఆటగాళ్లకు తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో మంచి స్థానాలు దక్కాయి.

 ఆరో స్థానంలో విలియమ్సన్‌:

ఆరో స్థానంలో విలియమ్సన్‌:

బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ ఖాతాలో ప్రస్తుతం 886 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ 881 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజామ్ (827), దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ (820), న్యూజిలాండ్ ఆటగాడు రాస్ టేలర్ (817) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ 796 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచాడు.

కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంక్:

కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంక్:

సెమీస్‌లో న్యూజిలాండ్ జట్టును వణికించిన భారత ఆటగాడు రవీంద్ర జడేజా ఏకంగా 24 స్థానాలు ఎగబాకాడు. ప్రస్తుతం జడేజా 108వ స్థానంలో ఉన్నాడు. మరో సెమీస్‌లో 85 పరుగులు, ఫైనల్‌ మ్యాచ్‌లో 17 పరుగులు చేసిన ఇంగ్లాండ్‌ ఓపెనర్ జేసన్ రాయ్‌ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంక్ అందుకున్నాడు. 774 పాయింట్లతో రాయ్ పదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఫైనల్‌లో ఇంగ్లాండ్ జట్టును ఆదుకున్న బెన్‌ స్టోక్స్‌ 694 పాయింట్లతో టాప్‌20లోకి వచ్చాడు.

టాప్‌30లో ఆర్చర్‌:

టాప్‌30లో ఆర్చర్‌:

బౌలింగ్‌లో జస్ప్రీత్‌ బుమ్రా 809 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ట్రెంట్ బోల్ట్, కాగిసో రబాడ, పాట్ కమిన్స్, ఇమ్రాన్ తాహిర్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. టోర్నీ వికెట్ల టాపర్ స్టార్క్ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ ఆటగాడు క్రిస్‌ వోక్స్‌ ఏడో స్థానం, కివీస్ బౌలర్‌ మ్యాట్‌ హెన్రీ పదో స్థానంలో ఉన్నారు. టోర్నీలో 20 వికెట్లు పడగొట్టిన సంచలన బౌలర్ ఆర్చర్‌ టాప్‌30లో చోటు సంపాదించాడు.

అగ్రస్థానంలో షకిబ్:

అగ్రస్థానంలో షకిబ్:

ఆల్‌రౌండర్‌ జాబితాలో బంగ్లాదేశ్‌ ఆటగాడు షకిబ్ అగ్రస్థానంలో నిలిచాడు. స్టోక్స్‌ రెండో స్థానంలో ఉన్నాడు. మొహ్మద్ నబీ, ఇమాద్ వసీం, రషీద్ ఖాన్ వరుసగా ఉన్నారు. భారత్ నుంచి హార్దిక్ పాండ్యా 10 స్థానంలో చోటు దక్కించుకున్నాడు. తొలిసారి ప్రపంచకప్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ 125 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. భారత్, న్యూజిలాండ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Story first published: Tuesday, July 16, 2019, 9:04 [IST]
Other articles published on Jul 16, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+