Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కివీస్‌పై ఘన విజయం.. సెమీస్‌కు ఇంగ్లండ్‌

ICC Cricket World Cup 2019 : England Defeated New Zealand By 119 Runs || Match Highlights
CWC 19, England vs New Zealand: England beat New Zealand by 119 runs to make Cricket World Cup semi-finals

వరుస ఓటములతో సెమీస్‌ ఆశలపై అనుమానాలున్న టోర్నీ ఫేవరెట్‌, ఆతిధ్య ఇంగ్లాండ్‌ ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండానే ప్రపంచకప్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌పై 119 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడంతో.. ఇంగ్లండ్‌ 27 ఏండ్ల తర్వాత (1992 ప్రపంచకప్‌ తర్వాత) తొలిసారి సెమీఫైనల్ చేరుకుంది. ఇంగ్లండ్‌ నిర్దేశించిన 306 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ 45 ఓవర్లలో 186 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ విజయంతో మిణుకు మిణుకుమంటున్న పాక్ నాకౌట్ ఆశలు గల్లంతైయ్యాయి.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఆదిలోనే ఎదురుదెబ్బ:

ఆదిలోనే ఎదురుదెబ్బ:

భారీ ఛేదనలో కివీస్‌కు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్ నికోల్స్ (0) రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. మార్క్ వుడ్ బౌలింగ్‌లో నికోల్స్ వికెట్ల ముందు దొరికిపోయాడు. మరో ఓపెనర్ గప్టిల్( 8) కూడా నిరాశపరిచాడు. దీంతో ఆదిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం సీనియర్‌ ఆటగాళ్లు విలియమ్సన్‌, రాస్‌ టేలర్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

8 పరుగుల వ్యవధిలో రెండు రనౌట్‌లు:

8 పరుగుల వ్యవధిలో రెండు రనౌట్‌లు:

అయితే దురదృష్టవశాత్తు విలియమ్సన్‌ (27), టేలర్‌ (28)లు ఎనిమిది పరుగుల తేడాతో రనౌట్‌ కావడం కివీస్‌ను కోలుకోకుండా చేసింది. మూడో వికెట్‌కు వీరిద్దరూ 47 పరుగులు జోడించారు. అనంతరం ఏ దశలోనూ కివీస్‌ విజయంవైపు పయనించలేదు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌ లాథమ్‌ (57; 65 బంతుల్లో 5 ఫోర్లు) మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేకపోయారు.

వరుస విరామాల్లో వికెట్లు:

వరుస విరామాల్లో వికెట్లు:

జిమ్మీ నీషమ్‌ (9), గ్రాండ్‌హోమ్‌ (3)లు పూర్తిగా నిరాశపరిచారు. ఇంగ్లండ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కివీస్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్లు పెవిలియన్ చేరడంతో కివీస్‌ కనీసం 200 పరుగులు కూడా దాటలేకపోయంది. దీంతో భారీ ఓటమి చవిచూసింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో మార్క్‌ వుడ్‌ మూడు వికెట్లు తీయగా.. వోక్స్‌, రషీద్‌, స్టోక్స్‌, ఫ్లంకెట్‌, ఆర్చర్‌లు తలో వికెట్‌ పడగొట్టారు. సెంచరీ చేసిన బెయిర్‌ స్టోకు 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది.

Story first published: Thursday, July 4, 2019, 9:02 [IST]
Other articles published on Jul 4, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+