'దిగులు చెందాల్సిందేమి లేదు.. సెమీస్ అవకాశం మా చేతుల్లోనే ఉంది'

దిగులు చెందాల్సిందేమి లేదు. సెమీస్ అవకాశం మా చేతుల్లోనే ఉంది అని ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ పేర్కొన్నారు. మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 84 పరుగుల తేడాతో ఓడిపోయింది. బ్యాట్స్‌మన్ పూర్తిగా విఫలమవడంతో సాధారణ లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చేతులెత్తేసింది. దీంతో సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

బౌలింగ్ సరైన నిర్ణయమే:
మ్యాచ్ అనంతరం ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ... 'ఈ రోజు మేము తేలిపోయాం. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయమే. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని భావించి ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాం. ఆసీస్ ఓపెనర్లు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్‌ను నిర్మించారు. వికెట్ సవాలుగా ఉంది. ఫించ్ బాగా ఆడాడు. ఆదిలోనే ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు' అని మోర్గాన్ తెలిపారు .

మా చేతుల్లోనే:
'ఆసీస్ 330 పరుగులు చేస్తుందనుకున్నా. అయితే మా బౌలర్లు బాగా రాణించారు. ఆసీస్‌ను 285 పరుగులకే కట్టడి చేశాం. కానీ ఆదిలోనే కీలక వికెట్లు కోల్పోయాం. మా బ్యాట్స్‌మన్ పోరాడినా ఓడిపోయాం. మ్యాచ్ గురించి అంతగా దిగులు చెందాల్సిందేమి లేదు. సెమీస్ అవకాశం మా చేతుల్లోనే ఉంది. వచ్చే మ్యాచ్‌లో పుంజుకుంటాం' అని మోర్గాన్ ధీమా వ్యక్తం చేసాడు.

ఒక్కటి ఓడినా అంతే:
టోర్నీ ఆరంభంలో ఇంగ్లండ్ సునాయాసంగా సెమీస్ బెర్త్ దక్కించుకుంటుందని అందరూ ఊహించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తాజా ఓటమితో ఏడు మ్యాచ్‌లాడి కేవలం 8 పాయింట్లు మాత్రమే సాధించిన ఇంగ్లండ్.. ఇకపై ఆడాల్సిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి తీరాలి. అయితే ఇంగ్లండ్ తమ ఆఖరి రెండు మ్యాచ్‌లనూ బలమైన భారత్, న్యూజిలాండ్‌లతో ఆడాల్సి ఉంది. రెండింటిలో ఒక్కటి ఓడినా సెమీస్ బెర్త్ దక్కే అవకాశాలు తగ్గుతాయి. మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications