
ఫామ్‌లో ఇంగ్లండ్:
ఈ టోర్నీలో ఇంగ్లండ్ అదరగొడుతోంది. పాక్ మ్యాచ్‌లో మాత్రమే ఇంగ్లాండ్ టాపార్డర్ బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో ఓటమిని ఎదుర్కొంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ అద్భుతమైన ఫామ్‌లో ఉంది. జోయ్ రూట్ రెండు సెంచరీలు చేసి జోరు మీదున్నాడు. రూట్‌కు తోడుగా బట్లర్, బెయిర్‌స్టో, స్టోక్స్ చెలరేగితే ఇంగ్లండ్ పరుగుల వరద పారించొచ్చు. ఒపెనర్ జేసన్ రాయ్ తొడ కండరాల గాయంతో రెండు మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. ఇక వెన్ను నొప్పితో బాధపడుతున్న ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఈ మ్యాచ్‌లో ఆడేది అనుమానమే. మోర్గాన్ ఆడకుంటే.. జోస్ బట్లర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. బౌలింగ్‌లో క్రిస్ వోక్స్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్‌లతో పటిష్టంగా ఉంది. వీరిని అడ్డుకోవడం అఫ్గానిస్తాన్‌కు కష్టమే.

బ్యాటింగ్, బౌలింగ్ విఫలం:
ఇప్పటివరకు బోణీ కొట్టని అఫ్గానిస్తాన్.. అత్యద్భుత ప్రదర్శన చేస్తే తప్ప ఇంగ్లండ్‌పై విజయం సాధించలేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలోనూ అఫ్గాన్ విఫలమవడం జట్టుపై ప్రభావం చూపుతోంది. టోర్నీలో నజీబుల్లా, హష్మతుల్లా ఒక్కో అర్ధ సెంచరీ చేయడం మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ఇక బౌలింగ్‌లో నబీ, రషీద్ ఖాన్, గుల్బదిన్, హమీద్ హసన్ కూడా రాణించలేదు. ఈ నేపథ్యంలో అందరూ రాణిస్తేనే విజయంపై ఆశలు ఉంటాయి.

వర్షం ఆటకం:
మాంచెస్టర్‌లో గత కొద్దీ రోజులుగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచుకు కూడా వర్షం ఆటకం కలిగించే అవకాశం ఉంది. మ్యాచ్ మద్యలో చిరు జల్లులు కురియనున్నాయట. అయితే పూర్తి మ్యాచ్ జరగుతుందని సమాచారం. ఈ రెండు జట్లు ప్రపంచకప్‌లో ఒక్కసారి తలపడ్డాయి. 2015 ప్రపంచకప్‌లో ఇరు జట్లు తలపడగా.. అఫ్గాన్‌పై ఇంగ్లాండ్ గెలిచింది.
Teams (Probable XI):
England: James Vince, Jonny Bairstow, Joe Root, Eoin Morgan, Ben Stokes, Jos Buttler, Chris Woakes, Liam Plunkett, Jofra Archer, Mark Wood/Moeen Ali, Adil Rashid.
Afghanistan: Hazratullah Zazai, Noor Ali Zadran, Rahmat Shah, Hashmatullah Shahidi, Asghar Afghan, Gulbadin Naib (capt), Mohammad Nabi, Ikram Alikhil (WK), Rashid Khan, Aftab Alam, Hamid Hassan.


Click it and Unblock the Notifications












