For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లాండ్‌-అఫ్గాన్‌ మ్యాచ్‌.. ప్రత్యేక అతిథి ఎవరో తెలుసా?

CWC 19, England vs Afghanistan: Afghanistan President Ashraf Ghani Cheers on as Afghanistan Takes on England

క్రికెట్‌కు సామాన్యులు, సెలెబ్రెటీలు అనే తేడా లేకుండా అభిమానులు ఉంటారు. తమ ఆరాధ్య క్రికెటర్ లేదా తమ దేశం క్రికెట్ మ్యాచ్‌లు ఆడుతుంటే ఆ మ్యాచ్‌ చూడాలని కోరుకుంటారు. మరికొందరు స్వయంగా మైదానానికి వెళ్లి మరి తమ జట్టుకు మద్ధతు తెలుపుతారు. అంతేకాదు ఎలాగైనా తమ జట్టు గెలవాలని కోరుకుంటారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ క్రమంలో ప్రస్తుత ప్రపంచకప్‌లోనూ చాలా మంది సినీ తారలు, ప్రముఖులు తమ తమ దేశ మ్యాచ్‌లకు హాజరై మద్దతు తెలుపుతున్నారు. భారత్-పాక్ మ్యాచ్‌కు అంబానీ కుటుంబం, రణవీర్ సింగ్, మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వారు మైదానానికి వెళ్లి టీమిండియాకు మద్దతు తెలిపారు. తాజాగా మంగళవారం ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ మైదానంలో జరిగిన ఇంగ్లాండ్‌-అఫ్గానిస్థాన్‌ మ్యాచ్‌కు ఓ ప్రత్యేక అతిథి హాజరయ్యారు.

అఫ్గనిస్తాన్‌ దేశాధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ మ్యాచ్ వీక్షించేందుకు అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ అజీజుల్లాతో కలిసి వెళ్లారు. అష్రఫ్‌ మ్యాచ్‌ను వీక్షిస్తూ తమ జట్టుకు మద్దతు తెలిపారు. మైదానంలోని స్పెషల్ బాక్సులో నిలబడి ఆటగాళ్లకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

ఈ మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌ 150 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో అఫ్గాన్‌ టోర్నీలో ఇప్పటికీ విజయం రుచి చూడలేదు. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. ఇక అఫ్గాన్‌ జట్టుకు నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. నాలుగు గెలిచినా కూడా సెమీస్ చేరడం కష్టమే. మిగతా మ్యాచ్‌ల్లోనైనా అఫ్గాన్‌ ఓ విజయం సాధిస్తుందో లేదో చూడాలి.

Story first published: Wednesday, June 19, 2019, 12:51 [IST]
Other articles published on Jun 19, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+