
ఎవరెస్ట్ అధిరోహించాడు:
తాజాగా ఆండ్రూ స్ట్రాస్ మాట్లాడుతూ... 'మోర్గాన్ ఎవరెస్ట్ అధిరోహించాడు. గతంలో మేం తప్పులు చేసాం. యాషెస్ సిరీస్ గెలిచాం. ప్రపంచంలో నంబర్ స్థానానికి చేరుకున్నాం. ఇక అక్కడితో సంతృప్తి చెందాం. కానీ.. మోర్గాన్ సేన కప్ సాధించింది. చాలా ఆనందంగా ఉంది' అని స్ట్రాస్ పేర్కొన్నారు.

కెప్టెన్‌గా ఇంకా కొనసాగాలి:
'మోర్గాన్ జట్టుకు నాయకత్వం వహించాలా వద్దా అని అతని ఇష్టం. నేనైతే అతను కొనసాగాలని కోరుకుంటున్నా. గత నాలుగు సంవత్సరాలుగా చూస్తున్నా.. జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. అతనో గొప్ప నాయకుడు' అని స్ట్రాస్ అన్నారు. 'మోర్గాన్ కెప్టెన్‌గా ఇంకా కొనసాగాలి. అతను కెప్టెన్‌గా ఉంటాడని ఆశిస్తున్నాను. మోర్గాన్ అద్భుతంగా జట్టును నడిపించాడు. ఉత్తమ కెప్టెన్. అతని సారథ్యంలో ఆడడానికి ఇష్టపడతాను' అని వికెట్ కీపర్, వైస్ కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపారు.

విజేతగా ఇంగ్లండ్:
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. అనంతరం 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కూడా నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. సూపర్ ఓవర్ కూడా టై కావడంతో.. మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు బాదిన ఇంగ్లండ్ జట్టు విజేతగా నిలిచింది.


Click it and Unblock the Notifications












