న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌.. 12 సంవత్సరాల తరువాత దినేశ్‌ కార్తీక్‌కు చోటు

CWC 19, Bangladesh vs India: Part of World Cup 2007 squad, Dinesh Karthik makes WC debut 12 years later

భారత సీనియర్ క్రికెటర్, వికెట్ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ 12 సంవత్సరాల తరువాత ప్రపంచకప్‌ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. చివరి సారిగా 2007లో ప్రపంచకప్‌కు ఎంపికయినా.. ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అనంతరం జరిగిన 20011, 2015 ప్రపంచకప్‌లలో చోటు దక్కించుకోలేదు. మళ్లీ గాడిలో పడిన కార్తీక్‌ 2019 ప్రపంచకప్‌లో బ్యాకప్ కీపర్‌గా ఎంపికయ్యాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌ కేదార్ జాదవ్ విఫలమయ్యాడు. బ్యాటింగ్ అవకాశం వచ్చిన నాలుగు మ్యాచులలో వరుసగా 9*, 52, 7, 12* పరుగులు చేసాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ జట్టుపై తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో బర్మింగ్‌హామ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేదార్‌ జాదవ్‌ను తప్పించి దినేశ్‌ కార్తీక్‌కు అవకాశం ఇచ్చారు. దీంతో కార్తీక్‌ 12 సంవత్సరాల తరువాత ప్రపంచకప్‌ తొలి మ్యాచ్ ఆడుతున్నాడు.

ఈ రోజు మ్యాచ్‌లో టీమిండియాలో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. కేదార్‌ జాదవ్‌కి బదులు దినేశ్‌కార్తీక్‌ బరిలో దిగుతుండగా.. స్పిన్నర్ కుల్‌దీప్‌కి బదులు పేసర్ భువనేశ్వర్‌ ఆడుతున్నాడు. టాస్‌ గెలిచిన కోహ్లీ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌లు ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. తొలి ఓవర్‌ రెండో బంతికి రాహుల్‌ పరుగు తీసి పరుగుల ఖాతా తెరిచాడు. ఇక నాల్గో బంతిని రోహిత్ సిక్స్‌ కొట్టి తన ఇన్నింగ్స్‌ ప్రారంభించాడు.

అదే ఊపు కొనసాగిస్తూ రోహిత్‌ శర్మ హాఫ్‌ సెంచరీ సాధించాడు. 45 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో అర్థ శతకం నమోదు చేశాడు. ప్రస్తుతం భారత్ 17 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 99 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ (53), కేఎల్‌ రాహుల్‌ (42) ఉన్నారు.

Story first published: Tuesday, July 2, 2019, 16:25 [IST]
Other articles published on Jul 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X