Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బంగ్లాతో మ్యాచ్‌.. పవర్‌ప్లేలో టీమిండియా రికార్డు

CWC 19, Bangladesh vs India: India bags highest World Cup 2019 powerplay score Againest Bangladesh Clash

వన్డే ప్రపంచకప్‌-2019లో టీమిండియా ఓ రికార్డు నమోదు చేసింది. బర్మింగ్‌హామ్ వేదికగా ప్రస్తుతం బంగ్లాదేశ్‌, టీమిండియా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ గెలిచి సెమీస్‌ బెర్త్‌ ఖాయం చేసుకోవాని భారత్ చూస్తోంది. ఇంగ్లాండ్ జట్టుపై పరుగులు చేయలేక ఇబ్బంది పడ్డ ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌లు ఇన్నింగ్స్‌ను ఘనంగా ఆరంభించారు. తొలి ఓవర్‌ రెండో బంతికి రాహుల్‌ పరుగు తీసి పరుగుల ఖాతా తెరిచాడు. ఇక నాల్గో బంతిని రోహిత్ సిక్స్‌ కొట్టి తన ఇన్నింగ్స్‌ ప్రారంభించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఇద్దరు బంగ్లా బౌలర్లకు చుక్కులు చూపిస్తూ పరుగుల వరద పారిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా 10 ఓవర్లకు వికెట్‌ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. దీంతో 2019 ప్రపంచకప్‌లో భారత్ తన అత్యధిక పవర్‌ప్లే స్కోరు సాధించింది. అంతకుముందు మాంచెస్టర్‌లో పాక్‌పై 53 చేయగా.. విండీస్‌పై 47 పరుగులు చేసింది. ఇక ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో అయితే 30 పరుగులే చేసింది. ఈ ఇద్దరికీ ఇదే అత్యుత్తమ ఓపెనింగ్‌ భాగస్వామ్యం కావడం విశేషం.

రోహిత్ అదే ఊపు కొనసాగిస్తూ హాఫ్‌ సెంచరీ సాధించాడు. 45 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో అర్థ శతకం నమోదు చేశాడు. అనంతరం రాహుల్ కూడా అర్థ శతకం అందుకున్నాడు. రోహిత్ వరుస మ్యాచులలో పరుగుల ప్రవాహం పారించడంతో ఈ టోర్నీలో లీడింగ్ రన్ స్కోరర్ గా నిలిచాడు. మరోవైపు రోహిత్ వన్డే ఫార్మాట్‌లో ఈ ఏడాది వెయ్యి పరుగుల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఈ ఏడాది వెయ్యి పరుగులు సాధించడానికి నాలుగు పరుగుల దూరంలో ఉన్న రోహిత్‌.. మొర్తజా వేసిన తొలి ఓవర్‌ నాల్గో బంతిని సిక్స్‌ కొట్టి పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం భారత్ 24 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 158 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ (91), కేఎల్‌ రాహుల్‌ (63) ఉన్నారు.

Story first published: Tuesday, July 2, 2019, 17:05 [IST]
Other articles published on Jul 2, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+