Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియాపై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్

CWC 19, Australia vs West Indies Match: West Indies have won the toss and have opted to field

ప్రపంచకప్‌లో భాగంగా గురువారం నాటింగ్‌హామ్ వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య మరికొద్ది సేపట్లో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వికెట్ చాలా బాగుంది, అందుకే బౌలింగ్ ఎంచుకున్నా అని హోల్డర్ తెలిపాడు. టాస్ నెగ్గితే బ్యాటింగ్ ఎంచుకునే వాడిని అని ఆరోన్ ఫించ్ తెలిపాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

వెస్టిండీస్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. బ్రేవో బదులుగా ఎవిన్ లెవిస్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఆసీస్ ఎలాంటి మార్పు చేయలేదు. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు తమ తొలి మ్యాచ్‌లలో విజయం సాధించి మంచి ఫామ్‌లో ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను వెస్టిండీస్ చిత్తుగా ఓడించగా.. పసికూన ఆఫ్ఘనిస్థాన్‌పై గెలిచి ఆసీస్ టోర్నీని ఘనంగా ప్రారంభించింది.

అయితే పటిష్ట బ్యాటింగ్, బౌలింగ్ ఉన్న ఇరు జట్ల మధ్య ఈ రోజు ఆసక్తికర పోరు జరగనుంది. గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలో దిగనుండటంతో ట్రెంట్‌బ్రిడ్జ్‌ మైదానంలో పరుగుల వరద పారే అవకాశముంది. అన్ని రంగాల్లో రెండు జట్లు సమ ఉజ్జీలుగా ఉన్నప్పటికీ.. మైదానంలో వ్యూహాలను సరిగ్గా అమలు చేసే జట్టునే విజయం వరించనుంది.

1
43653

{headtohead_cricket_1_8}

జట్లు:

ఆస్ట్రేలియా:
ఫించ్ (కెప్టెన్), వార్నర్, ఖవాజ, స్మిత్, మ్యాక్స్‌వెల్, స్టోయినిస్, క్యారీ, కౌల్టర్‌నైల్, కమ్మిన్స్, స్టార్క్, జంపా.

వెస్టిండీస్:
గేల్, లెవిస్, హోప్, పూరన్, హెట్మయర్, రసెల్‌, హోల్డర్, బ్రాత్వైట్, నర్స్, థామస్, కార్టెల్.

Story first published: Thursday, June 6, 2019, 15:02 [IST]
Other articles published on Jun 6, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+