ఇదే నా ఆఖరి ప్రపంచకప్.. సెమీస్ చేరకపోవడం బాధగా ఉంది

కచ్చితంగా చెపుతున్నా ఇదే నా ఆఖరి ప్రపంచకప్. ట్రోఫీ సాదించాలనుకున్నాం, కానీ అది జరగలేదు. సెమీస్ కూడా చేరకపోవడం బాధగా ఉంది అని వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ (40) పేర్కొన్నారు. అఫ్గానిస్థాన్‌తో గురువారం జరిగిన పోరులో వెస్టిండీస్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఆఖరి ప్రపంచకప్ మ్యాచ్ ఆడిన గేల్‌కు విండీస్ ఘనంగా వీడ్కోలు పలికింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

చివరి ప్రపంచకప్:
మ్యాచ్ అనంతరం క్రిస్ గేల్ మాట్లాడుతూ... 'నాకు మరికొన్ని మ్యాచ్‌లు ఉన్నాయి, ఏం జరుగుతుందో చూద్దాం. ఈ ప్రపంచకప్ పెద్దగా కలిసిరాలేదు, దాని గురించి ఏమీ చేయలేము. ఇది ఖచ్చితంగా నా చివరి ప్రపంచకప్. ట్రోఫీ అందుకోవాలనుకున్నా.. కానీ అది జరగలేదు. ఐదు ప్రపంచకప్‌లలో వెస్టిండీస్‌కు ప్రాతినిథ్యం వహించడం గొప్పగా ఉంది, దీన్ని గౌరవంగా భావిస్తున్నా' అని గేల్ తెలిపారు.
బాధగా ఉంది:
'సెమీస్ చేరకపోవడం బాధగా ఉంది. అయినా ఈ ప్రయాణాన్ని బాగా ఆస్వాదించా. ఎన్నో మధుర జ్ఞాపకాలతో చాలా సందడిగా ముగిసింది. జట్టులోని ప్రతీ ఒక్కరూ ఎంతో సహకరించారు. యువ ఆటగాళ్లు కలిసిమెలిసి ఉన్నారు. ఇంకా మాట్లాడేందుకు మాటలు రావడం లేదు' అని గేల్ భావోద్వేగం చెందారు. ఈ మ్యాచ్‌లో గేల్ 7 పరుగులే చేసి ఔట్ అయ్యాడు.

వెస్టిండీస్‌కు మంచి భవిష్యత్తు:f
'హెట్‌మైర్, షై హోప్, నికోలస్ పూరన్‌లతో వెస్టిండీస్ భవిష్యత్తు ఉజ్వలంగా కనిపిస్తుంది. వారు విండీస్ జెండాను ముందుకు తీసుకువెళతారు. జాసన్ హోల్డర్ లాంటి యువ కెప్టెన్ కూడా ఉన్నాడు. వెస్టిండీస్ అద్భుతంగా రాణిస్తుందనే నమ్మకం ఉంది. ఇక టీమిండియాతో వన్డే సిరీస్, సీపీఎల్, కెనడా టీ20లు ఆడుతాను' అని గేల్ చెప్పుకొచ్చారు.

తొమ్మిదో స్థానం:
మెగా టోర్నీ ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన వెస్టిండీస్.. ఆ తర్వాత మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓడి ఆఖరి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై విజయం సాధించింది. ప్రపంచకప్‌లో భాగంగా విండీస్ తొమ్మిది మ్యాచ్‌ల్లో రెండు గెలిచి, ఆరు ఓటమిపాలైంది. ఒక మ్యాచ్ వర్షంతో రద్దైంది. దీంతో 5 పాయింట్లతో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications