లిటిల్ మాస్టర్స్ లిటిల్ ఫ్యాన్: సచిన్ ఎత్తుకున్న ఆ చిన్నారి ఎవరు?
హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ట్విట్టర్‌లో పోస్టు చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సచిన్ పోస్టు చేసిన ఆ ఫోటోల్లో ఓ చిన్నారి ఉంది. చూడగానే ముద్దొస్తున్న ఆ చిన్నారిని ఎత్తుకున్న సచిన్ ఎంతో సంతోషంగా కనిపిస్తున్నాడు.
ఆ చిన్నారి ఎవరో కాదు. టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్, గీతా బస్రా దంపతుల ముద్దుల కుమార్తె. 2016 జులై 28న పుట్టిన హినాయా హీర్‌ని ఎత్తుకుని ముద్దాడుతూ సచిన్ టెండూల్కర్ ఎంతగానో మురిసిపోయాడు.

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరుపున
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా సచిన్, హర్భజన్ కలిసి గతంలో ముంబై ఇండియన్స్ జట్టు తరఫున ఆడిన సంగతి తెలిసిందే.

ముంబై ఇండియన్స్‌కు మెంటార్‌గా సచిన్
అంతేకాదు ముంబై ఇండియన్స్ జట్టుకు సచిన్ టెండూల్కర్ మెంటార్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్న ముంబై ఇండియన్ జట్టులో హర్భజన్ సింగ్ కూడా ఆడుతున్న సంగతి తెలిసిందే.
సచిన్‌తో పాటు షూటింగ్‌లో పాల్గొన్న భజ్జీ
ముంబై ఇండియన్ జట్టు ప్రమోషనల్ క్యాంపెయిన్‌లో భాగంగా సచిన్‌తో పాటు భజ్జీ షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఈ షూటింగ్‌లో సచిన్ టెండూల్కర్ భజ్జీ ముద్దుల కుమార్తె హినాయా హిర్‌ను ఎత్తుకున్నాడు.
లిటిల్ మాస్టర్స్ లిటిల్ ఫ్యాన్
ఈ క్రమంలో సచిన్ చిన్నారి హినయా హిర్ ఫోటోలను తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. భజ్జీ భార్య గీతా బస్రా కూడా తన గారాల పట్టి హినాయ లిటిల్ మాస్టర్‌తో కలిసి ఉన్న ఫొటోను ట్విటర్‌లో ఉంచింది. ఈ సందర్భంగా గీత ‘లిటిల్ మాస్టర్స్ లిటిల్ ఫ్యాన్' అంటూ ట్విటర్‌లో పేర్కొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications