న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మహేంద్ర సింగ్ ధోనీ కంటే.. జోస్ బట్లర్ బెస్ట్

Currently Jos Buttler better than MS Dhoni in white-ball cricket, says Tim Paine

హైదరాబాద్: టీమిండియా దిగ్గజ క్రికెటర్.. ధనాదన్ ధోనీతో పోల్చి చెప్పడమే కాకుండా బట్లరే గొప్ప క్రికెటర్ అంటూ కితాబిచ్చాడు ఆస్ట్రేలియా కెప్టెన్. ప్రస్తుత క్రికెట్‌లో వయస్సుతో సంబంధం లేకుండా దూసుకుపోతోన్న క్రికెటర్ ధోనీ.. అటు ఐపీఎల్‌లో, ఇటు వన్డేల్లో ఆయనకు తిరుగులేదు. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్సీ వహించిన ధోనీ అదిరిపోయే ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును ట్రోఫీ గెలుచుకునేలా చేశాడు. ఈ క్రమంలో ధోనీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడని కొందరంటుంటే, అతను ఎప్పుడూ ఒకేలా ఆడుతున్నాడంటూ ప్రశంసలు కురిపించారు.

ధోనీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడని

ధోనీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడని

ఈ క్రమంలో ధోనీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడని కొందరంటుంటే, అతను ఎప్పుడూ ఒకేలా ఆడుతున్నాడంటూ ప్రశంసలు కురిపించారు. అలాంటిది.. వన్డే, టీ20ల్లో ధోనీ కంటే ఇంగ్లాండ్ వికెట్ కీపర్/ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ అత్యుత్తమంగా ఆడుతున్నాడని ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైనీ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఆస్ట్రేలియాతో ముగిసిన ఐదో వన్డేలో అజేయంగా సెంచరీ బాదేసిన జోస్ బట్లర్ 122 బంతుల్లో (110) 12 ఫోర్లు, 1 సిక్సుతో నాటౌట్‌గా నిలిచి ఒంటిచేత్తో ఇంగ్లాండ్‌ని గెలిపించాడు.

ఒంటిచేత్తో ఇంగ్లాండ్‌ని గెలిపించాడు

ఒంటిచేత్తో ఇంగ్లాండ్‌ని గెలిపించాడు

206 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 29.4 ఓవర్లు ముగిసే సమయానికి 114/8తో ఓటమి అంచుల్లో నిలిచింది. కానీ.. ఈ దశలో అసాధారణ ఇన్నింగ్స్ ఆడిన బట్లర్.. ఆదిల్ రషీద్ (20: 47 బంతుల్లో)తో కలిసి 8వ వికెట్‌కి 81 పరుగుల భాగస్వామ్యంతో ఇంగ్లాండ్‌కి ఓటమి తప్పించాడు. దీంతో.. ఐదు వన్డేల సిరీస్‌ని ఇంగ్లాండ్ 5-0తో క్వీన్‌స్వీప్ చేయగలిగింది.

టిమ్‌ పైనీ మాట్లాడుతూ.. జోస్ బట్లర్ చాలా బాగా

టిమ్‌ పైనీ మాట్లాడుతూ.. జోస్ బట్లర్ చాలా బాగా

మ్యాచ్ అనంతరం బట్లర్ ఇన్నింగ్స్‌పై టిమ్‌ పైనీ మాట్లాడుతూ ‘జోస్ బట్లర్ చాలా బాగా ఆడాడు. వన్డే, టీ20ల్లో ఇప్పుడు అతనే అత్యుత్తమ వికెట్ కీపర్/ బ్యాట్స్‌మెన్. ప్రస్తుతం అతనికి దరిదాపుల్లోకి కూడా ఎవరూ రాలేరేమో అనిపిస్తోంది. మహేంద్రసింగ్‌ ధోనీ కూడా మంచి వికెట్ కీపర్/ బ్యాట్స్‌మెన్. కానీ.. గత కొద్దిరోజుల నుంచి జోస్ బట్లర్ అతని కంటే అత్యుత్తమంగా ఆడుతున్నాడు.'

మ్యాచ్ గమనానికి అనుగుణంగా

మ్యాచ్ గమనానికి అనుగుణంగా

వన్డే‌ల్లో మ్యాచ్ గమనానికి అనుగుణంగా ఆడటమెలాగో బట్లర్ చక్కగా అర్థం చేసుకుంటున్నాడు' అని ప్రశంసించాడు. ఈ వన్డే సిరీస్‌లో మొత్తం 275 పరుగులు చేసిన బట్లర్.. మూడు మ్యాచ్‌ల్లో 91, 54, 110 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌ కంటే ముందు జరిగిన ఐపీఎల్ 2018 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌ తరఫున ఆడిన బట్లర్.. దాదాపు 600 పరుగులతో రాణించాడు.

Story first published: Monday, June 25, 2018, 16:58 [IST]
Other articles published on Jun 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X