Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పరిస్థితులు అనుకూలంగా లేవు: పాక్‌తో క్రికెట్ ఆడటంపై శుక్లా

Current situation doesn't allow cricketing ties with Pakistan: Shukla

హైదరాబాద్: భారత్-పాకిస్థాన్ మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఇరు జట్ల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌లు జరిగే అవకాశం లేదని ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా అభిప్రాయపడ్డారు. భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు తాము ఆసక్తి ప్రదర్శిస్తున్నామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీబీసీ) ఛైర్మన్ నజాం సేథి ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 'భారత్‌తో ఆడటం మన హక్కు. దాయాది దేశంతో ఆడటం వల్ల 100 నుంచి 150 మిలియన్‌ డాలర్ల ఆదాయం వస్తుంది. అంత డబ్బుని అనవసర కారణాలతో విడిచిపెట్టుకోలేం కదా? గతంలో కుదర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం భారత్‌ని మ్యాచ్‌లు ఆడాలని కోరుతున్నాం' అని సేథీ వివరించారు.

ఈ వ్యాఖ్యలపై రాజీవ్ శుక్లా సోమవారం స్పందించాడు. 'క్రికెటర్ల భద్రత గురించి భారత్ ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆ విషయంలో ఎలాంటి సర్దుబాట్లకి తావులేదు. అందుకే పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ ఆడేందుకు పరిస్థితులు ప్రస్తుతం అనుకూలంగా లేవు' అని రాజీవ్ శుక్లా తేల్చి చెప్పారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, December 25, 2017, 15:29 [IST]
Other articles published on Dec 25, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+