తగినంత అనుభవం లేదు.. కోహ్లీ, శాస్త్రిని ప్రశ్నించలేరు: సెలక్షన్ కమిటీపై కిర్మాణి

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ రవిశాస్త్రి చెప్పినట్లే జట్టుని సెలక్టర్లు ఎంపిక చేస్తున్నారని మాజీ సెలక్టర్ సయ్యద్ కిర్మాణి విమర్శించాడు. ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన అనంతరం జట్టు నుంచి తమని తప్పించే సమయంలో సెలక్టర్లు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని కరుణ్ నాయర్, మురళీ విజయ్‌లు మీడియా ఎదుట వాపోయిన సంగతి తెలిసిందే.
తాము ఇద్దరు ఆటగాళ్లకీ సమాచారం ఇచ్చామని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మూడు రోజుల క్రితం వివరణ ఇచ్చాడు. మరోవైపు, ఆసియా కప్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ రాణించినప్పటికీ, అతడికి వెస్టిండిస్‌తో రెండు టెస్టుల కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కకపోవడం... జట్టు ఎంపిక, ఆటగాళ్లతో సెలక్టర్లు వ్యవహరిస్తున్న తీరుపై సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మండిపడ్డాడు.

అనుభవం లేకపోవడంతోనే ఈ సమస్య తలెత్తింది
అయితే, ప్రస్తుతం ఉన్న సెలక్టర్లకి తగినంత అనుభవం లేకపోవడంతోనే ఈ సమస్య తలెత్తిందని సయ్యద్ కిర్మాణి తాజాగా వెల్లడించాడు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో "టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి పరోక్షంగా చీఫ్ సెలక్టర్ పాత్రని పోషిస్తున్నాడు. అతను కెప్టెన్ విరాట్ కోహ్లీ, జట్టులోని సీనియర్ ఆటగాళ్లతో కలిసి చర్చించి.. ఓ జాబితాని సెలక్టర్ల ముందు ఉంచుతున్నాడు" అని అన్నాడు.

ఆ ఇద్దరితో చర్చలు జరపడం కంటే వారు చెప్పిందే వింటున్నారు
"ప్రస్తుతం ఉన్న సెలక్షన్ కమిటీ సభ్యులకి రవిశాస్త్రి, కోహ్లీతో పోలిస్తే అనుభవం తక్కువ. దీంతో సెలక్టర్లు ఆ ఇద్దరితో చర్చలు జరపడం కంటే వారు చెప్పింది విని.. ఆ జాబితాను ఓకే చేస్తున్నారు" అని సయ్యద్ కిర్మాణి తెలిపాడు. కాగా. 68 ఏళ్ల సయ్యద్ కిర్మాణి 2000ల్లో టీమిండియా ఛీఫ్ సెలక్టర్‌గా వ్వవహారించిన సంగతి తెలిసిందే.

ఎమ్మెస్కే ప్రసాద్ కెరీర్‌లో ఆడింది ఆరు టెస్టులు, 17 వన్డేలు
ప్రస్తుతం చీఫ్ సెలక్టర్‌గా ఉన్న ఎమ్మెస్కే ప్రసాద్ కెరీర్‌లో ఆడింది ఆరు టెస్టులు, 17 వన్డేలు మాత్రమేకాగా.. సభ్యులుగా ఉన్న సరన్‌దీప్ సింగ్ (2 టెస్టులు, 5 వన్డేలు), దేవాంగ్ సింగ్ (4 టెస్టులు, 3 వన్డేలు), జతిన్ (4 వన్డేలు), గగన్ 2 వన్డేలు ఆడారు. దీంతో వారు కోహ్లీ, రవిశాస్త్రిని ప్రశ్నించి, విభేదించే సాహసం చేయలేకపోతున్నారని కిర్మాణీ స్పష్టం చేశాడు.

సెలక్షన్‌లో అదృష్టం కీలకపాత్ర పోషిస్తుంది
"సెలక్షన్‌లో అదృష్టం కీలకపాత్ర పోషిస్తుంది. అందుకు ఉదాహరణ నేనే. నా కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు నన్ను పక్కకుబెట్టారు" అని కిర్మాణి వెల్లడించాడు. సయ్యద్ కిర్మాణి భారత్ తరుపున మొత్తం 88 టెస్టులాడాడు. 1986లో రాజ్ కోట్ వేదికగా వెస్టిండిస్‌తో తన చివరి టెస్టుని ఆడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications