Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లాండ్ పర్యటనలో రాణించేందుకు ఇదే సరైన జట్టు: టెండూల్కర్

 Current pace attack is most complete India has ever had: Sachin Tendulkar

హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనకి మునుపెన్నడూ లేనంత బలమైన బౌలింగ్ లైనప్‌తో భారత్ జట్టు వెళ్తోందని దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. ఈ నెల 27, 29న ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్ ఆడనున్న భారత్.. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలతో పాటు ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌ని ఆడేందుకు అక్కడికి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో..సచిన్ టెండూల్కర్ మీడియాతో మాట్లాడుతూ భారత జట్టు ఆటగాళ్ల సామర్థ్యాలపై విశ్లేషించాడు.

'భారత జట్టు ఫాస్ట్ బౌలింగ్ అటాక్ మునుపెన్నడూ లేనంత బలంగా ప్రస్తుతం ఉంది. జట్టులో స్వింగ్ బౌలర్ భువనేశ్వర్, ఎత్తైన బౌలర్ ఇషాంత్ శర్మ, స్కిడ్డీ బౌలర్ జస్‌ప్రీత్‌ బుమ్రా, వేగవంతంగా బంతులు విసిరే ఉమేశ్ యాదవ్‌లు ఉన్నారు. ఇలాంటి కాంబినేషన్‌ దొరికితే.. జట్టుకి అదనపు ప్రయోజనాలు చేకూరతాయి. అందుకే.. ఈ బౌలింగ్ అటాక్ అత్యుత్తమని నా అంచనా. '

'భారత జట్టు మేనేజ్‌మెంట్ బ్యాట్‌తో పరుగులు రాబట్టే ఫాస్ట్ బౌలర్లవైపు ఎక్కువ మొగ్గు చూపుతోంది. భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్య ఇప్పటికే బ్యాట్‌తో కూడా రాణించారు. ఇంగ్లాండ్ పర్యటనలో అలాంటి ఆల్‌రౌండర్లే కీలకం కానున్నారు' అని సచిన్ వెల్లడించాడు.

ఈ నేపథ్యంలో ఇప్పటికే విదేశీ పర్యటనకు బయల్దేరిన టీమిండియా ఐర్లాండ్ చేరుకుంది. ఐర్లాండ్‌లో రెండు టీ20లు ఆడిన అనంతరం నేరుగా ఇంగ్లాండ్‌కు బయల్దేరనుంది. ఈ క్రమంలో మైదానంలో కసరత్తులు చేస్తూనే జిమ్‌లో చెమటోడ్చుతుందీ కోహ్లీసేన.

Story first published: Monday, June 25, 2018, 20:09 [IST]
Other articles published on Jun 25, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+