Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : చివరి టెస్టులోనూ స్మిత్‌కే ఆసీస్ పగ్గాలు.. కమిన్స్ అప్పుడే రావడం కుదరదా?

Cummins set to miss fourth test and Smith will lead

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగే చివరి టెస్టులో కూడా ఆస్ట్రేలియాకు స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ చేస్తాడని తెలుస్తోంది. తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా చాలా ఘోరంగా ఓడింది. అలాంటి సమయంలో కంగారూల కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తల్లికి అనారోగ్యం చేసింది. దీంతో అతను సెలవు తీసుకొని ఇంటికి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో జట్టు పగ్గాలను వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు అప్పగించారు. అతను జట్టును అద్భుతంగా ముందుకు నడిపించాడు.

ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్టులో అద్భుతమైన కెప్టెన్సీతో ఆకట్టుకున్న స్మిత్.. జట్టును గెలిపించాడు. తెలివైన వ్యూహాలతో భారత జట్టుపై పైచేయి సాధించాడు. చాలా ఎక్కువ టర్న్, బౌన్స్ అవుతున్న హోల్కర్ పిచ్‌పై భారత ఆటగాళ్ల కన్నా కూడా ఆసీస్ ఆటగాళ్లే కంఫర్టబుల్‌గా కనిపించారు. దీనికి కారణం కచ్చితంగా స్మిత్ వేసిన వ్యూహాలే అని నిపుణులు కూడా స్పష్టం చేశారు. దీంతో చివరి టెస్టులో కూడా అతనే జట్టుకు కెప్టెన్సీ చేయాలని కొందరు అన్నారు. అయితే తనకు అలాంటి ఆలోచన లేదని స్మిత్ స్పష్టం చేశాడు.

Cummins set to miss fourth test and Smith will lead

మూడో టెస్టు ముగిసిన తర్వాత మాట్లాడిన స్మిత్.. 'నా టైం ఇక్కడితో అయిపోయింది. ఇప్పటి నుంచి మళ్లీ ఇది ప్యాట్ టీం. ఈ వారం నన్ను తాత్కాలికంగా నియమించారు. కొన్ని వ్యక్తిగత ఇబ్బందుల వల్ల ప్యాటీ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అతని కుటుంబం క్షేమంగా ఉండాలని మేమంతా కోరుకుంటున్నాం' అని వెల్లడించాడు. అదే సమయంలో తనకు కెప్టెన్సీ చేయడం చాలా ఇష్టమని, ముఖ్యంగా భారత్‌లో ఆ అవకాశం వస్తే చాలా ఎంజాయ్ చేస్తానని చెప్పాడు.

'భారత్‌లో కెప్టెన్సీ చేయడం నాకు చాలా ఇష్టం. ఒక విధంగా ప్రపంచం మొత్తమ్మీద కెప్టెన్‌గా నా ఫేవరెట్ ప్లేస్ ఇదే. ఇక్కడ ప్రతి బంతికీ ఏదో ఒకటి జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. అలాంటప్పుడు మనం ప్రత్యర్థుల కన్నా ముందుగానే ఆటను ఊహించాలి. లేదంటే గెలవడం కష్టం' అని చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, March 6, 2023, 15:13 [IST]
Other articles published on Mar 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+