Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSKvsSRH : గైక్వాడ్ బ్యాడ్ లక్ కలిసొచ్చిందిగా.. సన్‌రైజర్స్‌కు బ్రేక్ ఇచ్చిన ఉమ్రాన్!

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ లక్కీ బ్రేక్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన సన్‌రైజర్స్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. చాలా పేలవమైన బ్యాటింగ్‌‌తో తేలిపోయింది. చెన్నై స్పిన్నర్ల ముందు సన్‌రైజర్స్ బ్యాటర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. దీంతో కేవలం 134 పరుగులు మాత్రమే సన్‌రైజర్స్ చేసింది.

ఈ స్వల్ప లక్ష్య ఛేదనలో చెన్నైకి సూపర్ ఓపెనింగ్ లభించింది. డెవాన్ కాన్వే మరో హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అదే సమయంలో రుతురాజ్ గైక్వాడ్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అతను 30 బంతుల్లో 35 పరుగులు చేశాడు. పిచ్ కూడా స్పిన్నర్లకు సహకరిస్తుండటంతో ఈ చెన్నై ఓపెనర్లు ఆచితూచి ఆడటం మొదలు పెట్టారు. ఇలాంటి సమయంలోనే రుతురాజ్ గైక్వాడ్ దురదృష్టం అతన్ని దెబ్బతీసింది.

Umran Malik

ఉమ్రాన్ మాలిక్ వేసిన ఓవర్లో కాన్వే బ్యాటింగ్ చేస్తున్నాడు. ఉమ్రాన్ వేసిన ఫుల్ లెంగ్త్ డెలివరీని స్ట్రెయిట్ షాట్‌గా బలంగా బాదాడు. ఇది ఉమ్రాన్ వైపు నేరుగా వెళ్లింది. గాల్లో ఉన్న ఆ బంతిని ఉమ్రాన్ అందుకొని ఉంటే కాన్వే పెవిలియన్ చేరాల్సి వచ్చేది. కానీ ఉమ్రాన్ చేయి జారింది. ఇలా చెయ్యి జారిన బంతి నేరుగా వెళ్లి నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న వికెట్లను కూల్చింది.

అప్పుడు నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్.. బాల్ డెలివరీ కూడా అయిపోవడంతో క్రీజు వదిలి ముందుకు వచ్చి ఉన్నాడు. ఈ సమయంలో ఉమ్రాన్ చేతిని తగిలిన బంతి అటువైపు వికెట్లను కూల్చింది. దీంతో రుతురాజ్ రనౌట్‌గా వెనుతిరగాల్సి వచ్చింది. ఆ సమయంలో రుతురాజ్ ఎంత బాధ పడ్డాడో అతని మొఖం చూస్తే తెలిసిపోతుంది.

మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించిన రుతురాజ్ ఇలా అవుట్ అవడం చూసిన ఫ్యాన్స్ కూడా చాలా బాధ పడ్డారు. రుతురాజ్ దురదృష్టం ఇలా ఉమ్రాన్‌కు కలిసొచ్చిందని అంటున్నారు. ఏదేమైనా ఉమ్రాన్ ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కు తొలి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత రహానే కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ డెవాన్ కాన్వే మాత్రం చెన్నైకి విజయం అందించాలనే పట్టుదలతో కనిపించాడు.

Story first published: Friday, April 21, 2023, 22:46 [IST]
Other articles published on Apr 21, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+