Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSKvsSRH : ఉమ్రాన్ ఇన్.. వర్షం పడే ఛాన్స్.. మార్క్రమ్ మామ ఏం చేస్తాడో?

సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచింది. వాతావరణం వర్షం పడేలా ఉండటంతో ఈ మ్యాచ్‌లో టాస్ చాలా కీలకంగా మారింది. ఇలాంటి మ్యాచ్‌లో సీఎస్‌కే సారధి ఎంఎస్ ధోనీ టాస్ గెలిచాడు. మరో ఆలోచన లేకుండా తాము ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. ఆ తర్వాత మంచు ప్రభావం పెరిగే అవకాశం ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు.

తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని, చివరి మ్యాచ్ ఆడిన జట్టునే కొనసాగిస్తున్నామని చెప్పాడు. ఈ క్రమంలో తను టాస్ గెలిచి ఉంటే తను కూడా బౌలింగ్ ఎంచుకునే వాడినని సన్‌రైజర్స్ సారధి ఎయిడెన్ మార్క్రమ్ అన్నాడు. తమ టీం ఒక జట్టుగా రాణించాలని ఆశిస్తున్నట్లు చెప్పాడు. తాము కూడా గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలో దిగుతున్నట్లు వెల్లడించాడు.

CSKvsSRH

జట్టులో ఇంపాక్ట్ ప్లేయర్ల జాబితాలో కూడా ఎలాంటి మార్పులూ లేవన్న మార్క్రమ్.. చివరి మ్యాచ్‌లో ఆడిన 16 మందితోనే ఆడుతున్నట్లు చెప్పాడు. వర్షం పడేలా ఉండటంతో ముందుగా బ్యాటింగ్ చేసే జట్టు భారీ స్కోరు చేయాల్సిన అవసరం ఉంది. మరి పేలవ ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్ బ్యాటర్లు ఏమాత్రం ఆకట్టుకుంటారో చూడాలి. అలాగే హోం గ్రౌండ్ అడ్వాంటేజినీ ధోనీ ఎంత వరకు యూజ్ చేసుకుంటాడో కూడా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో చెన్నై ఓడిపోయింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్: హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠీ, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, హెన్రిక్ క్లాసెన్, మార్కో యాన్సెన్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్

చెన్నై సూపర్ కింగ్స్: డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, మొయీన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, మతీష పతిరాణా, తుషార్ దేశ్‌పాండే, మహీష్ తీక్షణ, ఆకాష్ సింగ్

Story first published: Friday, April 21, 2023, 19:39 [IST]
Other articles published on Apr 21, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+