Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSKvsSRH : ధోనీకి సూపర్ ఛాన్స్.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో బద్దలయ్యే రికార్డులివే!

ఐపీఎల్‌లో మరో సూపర్ హిట్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడేందుకు రెడీ అయ్యాయి. చెపాక్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని సన్‌రైజర్స్ పట్టుదలగా ఉంది. అదే సమయంలో చెన్నై కూడా ఆర్సీబీపై భారీ విజయం సాధించిన జోరు కొనసాగించాలని అనుకుంటోంది. ఈ క్రమంలోనే కొందరు ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీ అవుతున్నారు.

600 ఫోర్లు..: చెన్నై సూపర్ కింగ్స్‌కు ఊహించని బలంగా మారిన బ్యాటర్ అజింక్య రహానే. తన ధనాధన్ ఆటతో ఆ జట్టు టాపార్డర్‌ను మరింత బలంగా చేశాడీ టీమిండియా వెటరన్. అతను ఇప్పటి వరకు 220 టీ20 ఇన్నింగ్సుల్లో 5769 పరుగులు చేశాడు. వీటిలో 598 ఫోర్లు ఉన్నాయి. అతను కనుక సన్‌రైజర్స్‌పై రెండు ఫోర్లు బాదితే.. టీ20 ఫార్మాట్‌లో 600 ఫోర్లు బాదిన ఎనిమిదో భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టిస్తాడు. అదే కనుక ఈ మ్యాచ్‌లో ఏడు బౌండరీలు బాదితే.. ఐపీఎల్ హిస్టరీలో 450 ఫోర్లు బాదిన ఏడో భారత బ్యాటర్‌గా నిలుస్తాడు.

CSKvsSRH :

నట్టు.. సూపర్ హిట్టు..: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో అత్యంత కీలక బౌలర్లలో నటరాజన్ ఒకడు. డెత్ ఓవర్లలో అద్భుతమైన యార్కర్లతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే నటరాజన్ కూడా అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నాడు. ఇప్పటి వరకు సన్‌రైజర్స్ తరఫున 34 మ్యాచులు ఆడిన నటరాజన్ 40 వికెట్లు తీసుకున్నాడు. చెన్నైపై కనుక అతను రెండు వికెట్లు తీస్తే.. సన్‌రైజర్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా సందీప్ శర్మ (41) రికార్డును అధిగమిస్తాడు.

CSKvsSRH :

చెన్నై అంటే ధోనీ..: సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా అరుదైన ఘనత సాధించేందుకు రెడీగా ఉన్నాడు. ఈ ఫ్రాంచైజీ తరఫున 183 ఇన్నింగ్సులు ఆడిన ధోనీ 40.5 సగటుతో 4463 పరుగులు చేశాడు. సన్‌రైజర్స్‌తో మ్యాచులో కనుక అతను మరో 37 పరుగులు చేస్తే.. చెన్నై తరఫున 4500 పరుగుల మైలురాయిని చేరుకున్న రెండో బ్యాటర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ఇంతకుముందు సురేష్ రైనా (4687) మాత్రమే చెన్నై తరఫున ఈ మైలురాయిని చేరుకున్నాడు. మరి ఈ రికార్డును ఈ మ్యాచులోనే ధోనీ అధిగమిస్తాడేమో చూడాలి.

Story first published: Friday, April 21, 2023, 16:45 [IST]
Other articles published on Apr 21, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+