Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSKvsSRH : చేతులెత్తేసిన సన్‌రైజర్స్ బ్యాటర్లు.. చెన్నై ముందు చిన్న టార్గెట్!

చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటింగ్ తేలిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు ఏమాత్రం ప్రభావం చూపలేదు. మళ్లీ పాత పద్ధతిలోనే హ్యారీ బ్రూక్ (18) దారుణంగా విఫలమయ్యాడు. కాసేపు అలరించిన అభిషేక్ శర్మ (34) ఫర్వాలేదనిపించాడు. అతను తప్ప మిగతా బ్యాటర్లు ఎవరూ కనీసం 30 పరుగులు కూడా చెయ్యలేకపోయారు.

బ్రూక్ అవుటైన తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠీ (21) పెద్దగా ఆకట్టుకోలేదు. ఎయిడెన్ మార్క్రమ్ (12), హెన్రిక్ క్లాసెన్ (17) ఇద్దరూ విఫలమయ్యారు. చెన్నై స్పిన్ ఎటాక్ ముందు వీళ్లెవరూ నిలబడలేకపోయారు. కొత్త రోల్‌లో ఫినిషర్‌గా వచ్చిన మయాంక్ అగర్వాల్ (2) ఘోరంగా విఫలమయ్యాడు. చివర్లో మార్కో యాన్సెన్ (17 నాటౌట్) కొంత ఫర్వాలేదనిపించాడు. లేదంటే సన్‌రైజర్స్ ఈజీగా ఆలౌట్ అయిపోయేదే.

CSKvsSRH

ఈ సీజన్ ఆరంభం నుంచి ఘోరంగా ఆడుతున్న హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, వాషింగ్టన్ సుందర్.. ముగ్గురూ తేలిపోయారు. ముఖ్యంగా జడేజా బౌలింగ్‌లో సన్‌రైజర్స్ బ్యాటింగ్ పూర్తిగా తేలిపోయింది. మూడు కీలక వికెట్లు తీశాడు. అతనితోపాటు మహీష్ తీక్షణ, మతీష పతిరాణా, ఆకాష్ సింగ్ తలో వికెట్ తీసుకున్నారు. ఇన్నింగ్స్ ఆరంభంలో తడబడిన హ్యారీ బ్రూక్.. కొంత జోరు పెంచాలని అనుకున్నాడు.

కరెక్ట్‌గా అప్పుడే ఆకాష్ సింగ్ బౌలింగ్‌లో గట్టి షాట్ ఆడబోయాడు. ఈ సమయంలో గైక్వాడ్ అందుకున్న అద్భుతమైన క్యాచ్‌కు బ్రూక్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా తేలిపోయారు. అభిషేక్ శర్మ ఒక్కడే కొంత పోరాటం కనబరిచాడు. మిగతా వాళ్లు ఎవరూ కనీసం ఫైట్ చేయలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో సన్‌రైజర్స్ 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులు మాత్రమే చేసింది.

ఇదంతా చూసిన ఫ్యాన్స్ మరీ చిరాకు పడిపోతున్నారు. సన్‌రైజర్స్ అంటేనే ఇలా చెత్తగా ఆడతారని, బలమైన బ్యాటింగ్ ఉన్నా ఏమీ చేయలేరని విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ పిచ్‌పై బ్యాటింగ్ కష్టంగా ఉందని, అందుకే సన్‌రైజర్స్ ఇలా తేలిపోయారని మరికొందరు మద్దతు తెలుపుతున్నారు. మరి సన్‌రైజర్స్ ఈ లక్ష్యాన్ని ఎలా కాపాడుకుంటారో చూడాలి.

Story first published: Friday, April 21, 2023, 21:32 [IST]
Other articles published on Apr 21, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+