Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSKvsSRH : జడ్డూతో గొడవెందుకురా?.. క్లాసెన్‌పై నెట్టింట పేలుతున్న మీమ్స్!

సన్‌రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పెద్ద దుమారమే రేగింది. చెన్నై స్పిన్నర్ల ముందు సన్‌రైజర్స్ బ్యాటర్లు మరీ తేలిపోయారు. ఈ క్రమంలో సీఎస్‌కే ప్రధాన స్పిన్నర్ రవీంద్ర జడేజా, సన్‌రైజర్స్ వికెట్ కీపర్ హెన్రిక్ క్లాసెన్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇది ఫ్యాన్స్ మధ్య కూడా హీటింగ్ డిబేట్‌కు దారి తీసింది.

ఇన్ని మ్యాచుల్లో ఓపెనర్‌గా వచ్చి తేలిపోయిన మయాంక్ అగర్వాల్‌.. ఈ మ్యాచ్‌లో ఫినిషర్‌గా బరిలో దిగాడు. ఈ సమయంలో జడేజా బౌలింగ్‌కు వచ్చాడు. జడ్డూ వేసిన బంతిని స్ట్రెయిట్ షాట్ ఆడేందుకు మయాంక్ అగర్వాల్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి గాల్లోకి లేచింది. దాన్ని రిటర్న్ క్యాచ్ అందుకునేందుకు జడేజా ప్రయత్నించాడు. అయితే నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న హెన్రిక్ క్లాసెన్ దీన్ని అడ్డుకున్నాడు.

CSKvsSRH

బంతి వేయగానే సింగిల్ తీసేందుకు క్లాసెన్ ముందుకు వచ్చాడు. అప్పుడే మయాంక్ అగర్వాల్ ఈ బంతిని ఆడాడు. ఆ బంతి గాల్లో లేచి క్లాసెన్‌కు ఆవలి పక్కకు వెళ్లింది. దాన్ని అందుకునే సమయంలో క్లాసెన్ తనకు అడ్డురావడంతో జడ్డూకు కోపం వచ్చేసింది. 'ఏంటిది? ఏం చేస్తున్నావ్?' అంటూ క్లాసెన్‌పై చిరాకు పడ్డాడు. అయితే తనదేం తప్పులేదని క్లాసెన్ అన్నాడు.

ఇది జరిగిన కాసేపటికే మయాంక్ అవుటయ్యాడు. జడ్డూ వేసిన బంతిని ముందుకొచ్చి ఆడేందుకు మయాంక్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతను బంతిని మిస్ చేశాడు. దాన్ని అందుకున్న ధోనీ వెంటనే వికెట్లను కూల్చాడు. దీంతో మయాంక్ స్టంపౌట్‌గా పెవిలియన్ చేరాడు. ఇలా మయాంక్ అవుట్ అవగానే.. నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న క్లాసెన్ వైపు జడ్డూ ఒక సీరియస్ లుక్ ఇచ్చాడు.

'ఇప్పుడేం చేస్తావ్?' అని అడిగినట్లు ప్రవర్తించాడు. ఇది చూసిన ఫ్యాన్స్ కూడా ఈ హీట్ ఫీలయ్యారు. ఈ మ్యాచ్‌లో జడేజా మూడు కీలక వికెట్లు తీసుకోవడంతో.. నెట్టింట క్లాసెన్‌ను ట్రోల్ చేస్తున్నారు. జడ్డూతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని క్లాస్ పీకుతున్నారు. ఏదేమైనా ఈ ఘటనలో క్లాసెన్‌ది అంత పెద్ద తప్పేం లేదని నిపుణులు అంటున్నారు. అది అనుకోకుండా జరిగిన పొరపాటేనని చెప్తున్నారు.

Story first published: Friday, April 21, 2023, 22:06 [IST]
Other articles published on Apr 21, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+