Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSKvsSRH : ఆ క్యాచ్.. మ్యాచ్‌ను మా వైపు తిప్పింది: జడ్డూ

చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమితో సన్‌రైజర్స్ ప్లేఆఫ్ అవకాశాలు మరింత దిగజారాయి. అదే సమయంలో ఈ మ్యాచ్ విజయంతో చెన్నై అవకాశాలు మెరుగయ్యాయి. ఈ క్రమంలో ఈ మ్యాచ్‌ను మలుపు తిప్పిన క్షణం ఏదో చెన్నై కీలక ప్లేయర్ రవీంద్ర జడేజా చెప్పాడు. మ్యాచ్ అనంతరం తమ టీం బౌలింగ్ కోచ్‌ డ్వేన్ బ్రావోతో మాట్లాడిన జడ్డూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

హ్యారీ బ్రూక్ అవుటవడం ఈ మ్యాచ్‌ను తమవైపు తిప్పిందని అభిప్రాయపడ్డాడు. 'ఈ మ్యాచ్‌లో మేం కొన్ని అద్భుతమైన క్యాచులు అందుకున్నాం. బ్రూక్ గురించి నాకు తెలుసు. అతను మంచి షాట్లు ఆడుతున్నాడు. అలాంటి సమయంలో మంచి క్యాచ్‌తో అతన్ని అవుట్ చేశాం. ఇదే ఈ మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్. ఈ క్యాచ్‌తోనే మేం ఈ మ్యాచ్‌లో పైచేయి సాధించాం' అని జడ్డూ చెప్పాడు.

 jadeja

ఆ తర్వాత స్పిన్నర్లు చక్కగా బౌలింగ్ చేశారని, సన్‌రైజర్స్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారని అన్నాడు. స్పిన్నర్లు చాలా వికెట్లు తీసుకున్నారని, ఇది చాలా గొప్ప విషయమని తెలిపాడు. అలాగే చెపాక్‌లో తమ అభిమానులను కూడా జడ్డూ మెచ్చుకున్నాడు. మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా సరే ప్రేక్షకులు మాత్రం ఉత్సాహంగానే ఉంటారని చెప్పుకొచ్చాడు.

ప్రేక్షకుల నుంచి తమకు లభించే మద్దతు, ఎనర్జీ చాలా గొప్ప అనుభూతిని ఇస్తాయని జడ్డూ వెల్లడించాడు. 'చెపాక్‌లో ఎప్పుడు మ్యాచ్ జరిగినా ప్రేక్షకులు చాలా ఉత్సాహంగా ఉంటారు. వాళ్ల ఎనర్జీ వేరే లెవెల్‌లో ఉంటుంది. మేం మ్యాచ్ గెలుస్తున్నా లేక ఓడిపోయేలా ఉన్నా సరే.. వాళ్లు మమ్మల్ని చీర్ చేస్తూనే ఉంటారు' అని అభిమానులను కొనియాడాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 134 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ లక్ష్యాన్ని చెన్నై సునాయాసంగా ఛేజ్ చేసేలా కనిపించింది. కానీ సన్‌రైజర్స్ బౌలర్లు కూడా కొంత పోరాటం చూపించారు. అయితే చెన్నై ఓపెనర్ డెవాన్ కాన్వే 77 పరుగులతో అజేయంగా నిలిచి తమ జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతనికి ఇది వరుసగా మూడో హాఫ్ సెంచరీ కావడం గమనార్హం.

Story first published: Saturday, April 22, 2023, 16:05 [IST]
Other articles published on Apr 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+