రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చిత్తుగా ఓడింది. జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అతని నమ్మకాన్ని నిలబెట్టిన యశస్వి జైస్వాల్ (77) ఆరంభం నుంచే చెన్నై బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. అవతలి పక్క జోస్ బట్లర్ (27), సంజూ శాంసన్ (17) తడబడినా.. జైస్వాల్ చెలరేగాడు.
ఆ తర్వాత హెట్మెయర్ (8) ఫెయిలైనా.. చివర్లో ధృవ్ జురెల్ (34), దేవదత్ పడిక్కల్ (27 నాటౌట్) కూడా అదరగొట్టడంతో రాజస్థాన్ జట్టు 202 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో చెన్నైకు అనుకున్న ఆరంభం దక్కలేదు. ఫామ్‌లో ఉన్న డెవాన్ కాన్వే (8) విఫలమయ్యాడు. అయితే రుతురాజ్ గైక్వాడ్ (47) ఆకట్టుకున్నాడు. కానీ అతనికి సహకారం అందించే వాళ్లు కరువయ్యారు.

మంచి ఫామ్‌లో ఉన్న అజింక్య రహానే (12)ను అవుట్ చేసిన అశ్విన్.. అదే ఓవర్లో అంబటి రాయుడు (0)ను డకౌట్ చేశాడు. శివమ్ దూబే (52), మొయీన్ అలీ (23), రవీంద్ర జడేజా (23 నాటౌట్) రాణించినా చెన్నైని గెలిపించలేకపోయారు. ఈ ఐపీఎల్‌లో చెన్నైపై గెలవడం రాజస్థాన్‌కు ఇది రెండో సారి. తొలిసారి చెపాక్‌లో జరిగిన మ్యాచ్‌లో కూడా లక్ష్యాన్ని ఛేజ్ చేయడంలో చెన్నై విఫలమైంది.
ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న కొందరు చెన్నై ఫ్యాన్స్.. జట్టులోని అంబటి రాయుడుపై మండిపడుతున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు రాయుడు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేదు. అలాంటి ఆటగాడికి వరుస అవకాశాలు ఇవ్వడం ఏమాత్రం కరెక్ట్ కాదని వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరొక ఆటగాడికి ఎవరికీ ఇన్ని అవకాశాలు ఇవ్వలేదని గుర్తుచేస్తున్నారు.
మరికొందరేమో గతేడాది రిటైర్‌మెంట్ ప్రకటించిన రాయుడును అసలు కొనసాగించడమే పెద్ద తప్పు అంటూ తిడుతున్నారు. గతేడాది సీఎస్‌కే యాజమాన్యం చొరవ తీసుకోవడంతో రాయుడు తను రిటైర్ అవడం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. అతని వల్ల రూ.6.5 కోట్లు జట్టుకు నష్టం తప్ప ఎలాంటి ఉపయోగం లేదని ఫ్యాన్స్ అంటున్నారు. మరి అతనిపై సీఎస్‌కే యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.