Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSKvsRR : ఇక రిటైర్ అయిపోతే బెటర్.. చెన్నై స్టార్ ప్లేయర్‌పై ట్రోల్స్!

రాజస్థాన్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ తమ సొంత మైదానంలో ఓటమ పాలైంది. ఈ ఓటమికి ప్రధాన కారణాల్లో చెన్నై మిడిలార్డర్ వైఫల్యం కూడా ఒక కారణమే. శివమ్ దూబే, శివమ్ దూబే ఇద్దరూ పెద్దగా రాణించలేదు. ముఖ్యంగా అంబటి రాయుడు ఈ ఏడాది ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లో మాత్రమే తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేశాడు. మిగతా మ్యాచుల్లో పెద్దగా ఆకట్టుకోలేదు.

రాజస్థాన్‌తో మ్యాచ్‌లో చెన్నై జట్టు 36 బంతుల్లో 73 పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు రాయుడు క్రీజులో ఉన్నాడు. చాహల్ వేసిన షార్ట్ బాల్‌ను పుల్ చేసేందుకు ప్రయత్నించిన అతను.. డీప్ మిడ్‌వికెట్‌లో హెట్మెయర్‌కు క్యాచ్ ఇచ్చాడు. తన కుడివైపు డైవ్ చేసి మరీ హెట్మెయర్ ఈ క్యాచ్ పట్టేశాడు. అప్పటికి రాయుడు చేసిన స్కోరు కేవలం ఒక్క పరుగే. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలో దిగిన అతను ఎదుర్కొన్న రెండో బంతికే పెవిలియన్ చేరాడు.

CSKvsRR

ఇలా రాయుడు వరుసగా విఫలం అవడం చూసిన అభిమానులు ఏమాత్రం సంతోషంగా లేరు. రాయుడు ఇకనైనా ఆడటం మానేయాలని, ఇలా చెత్త షాట్లు ఆడి ఫెయిల్ అవడం కంటే గౌరవనీయంగా రిటైర్ అయిపోవడం చాలా మంచిదని సలహాలు ఇస్తున్నారు. రాయుడు పని అయిపోయిందని, అతను జట్టుకు పూర్తిగా భారంగా మారాడని విమర్శలు చేస్తున్నారు. రాయుడు తమ అభిమాన చెన్నై ప్లేయర్ అని, కానీ ప్రస్తుతం అతన్ని ఆడించడం వేస్ట్ అని అంటున్నారు.

CSKvsRR

కాగా, ఈ మ్యాచ్‌లో 176 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన చెన్నై జట్టు మిడిలార్డర్ వైఫల్యంతో దెబ్బతిన్నది. దూబే (8), మొయీన్ అలీ (7), రాయుడు (1) పరుగులు మాత్రమే చేశారు. చివర్లో రవీంద్ర జడేజా (25 నాటౌట్), ఎంఎస్ ధోనీ (30 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది. సందీప్ శర్మ చివరి ఓవర్‌ను అద్భుతంగా వేయడంతో.. క్రీజులో ధోనీ ఉన్నా కూడా చెన్నైని గెలిపించుకోలేకపోయాడు. మరి వచ్చే మ్యాచ్‌లో రాయుడిని ఆడిస్తారో లేదో చూడాలి.

Story first published: Thursday, April 13, 2023, 12:15 [IST]
Other articles published on Apr 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+