Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSKvsRR : చెన్నై ఓటమికి ప్రధాన కారణాలు ఏంటంటే?

రాజస్థాన్ రాయల్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిపాలైంది. ఇది చెపాక్‌లో చెన్నైని ఓడించడం రాజస్థాన్‌కు ఇదే తొలిసారి. ఈ క్రమంలో హేమాహేమీల వంటి ఆటగాళ్లున్న చెన్నై.. ఇలా రాజస్థాన్ చేతిలో ఓటమి పాలవడం అభిమానులు ఏమాత్రం నమమ్లేకపోతున్నారు. చెపాక్‌లో అంతకుముందు మ్యాచ్‌లో 200పైగా స్కోరు చేసిన చెన్నై.. 175 పరుగుల టార్గెట్ ఛేదించలేక ఓడిపోయింది. ఈ ఓటమికి కారణాలు ఏంటంటే..

మిడిలార్డర్ వైఫల్యం : కొంత కాలం క్రితం వరకు చెన్నై మిడిలార్డర్ బ్యాటింగ్ బలంగా ఉండేది. సునీల్ నరైన్, ఎంఎస్ ధోనీ ఇద్దరూ కలిసి ఆడటం లేదు. ఇక ధోనీ కూడా అనుకున్న రేంజ్‌లో రాణించలేదు. అజింక్య రహానే, శివమ్ దూబే, అంబటి రాయుడు వంటి వాళ్లు ఉన్నప్పటికీ.. చెన్నై మిడిలార్డర్ విఫలం అయింది. కీలకమైన సమయంలో విలువైన పరుగులు చేయడంలో విఫలమైంది. ముఖ్యంగా దూబే, రాయుడు నిలకడలేని ఆటతో ఆ జట్టుకు భారంగా మారారు.

 CSKvsRR

తీక్షణ ప్రభావం ఏది? : చెన్నైలోని చిదంబరం స్టేడియం అంటేనే స్పిన్నర్లకు స్వర్గ ధామం. ఇలాంటి పిచ్‌పై చెన్నై ప్రధాన స్పిన్నర్ మహీష్ తీక్షణ ఏమాత్రం ప్రభావం చూపలేదు. అతను నాలుగు ఓవర్లు వేసి 42 పరుగులు ఇచ్చాడు. ఒక పక్క జడేజా కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తున్నా.. తీక్షణ మాత్రం సరైన బంతులు వేయలేకపోయాడు. దీంతో ప్రత్యర్థులు ధారాళంగా పరుగుు సమర్పించుకున్నాడు. అతను కనుక చెపాక్‌లో రాణించకపోతే పక్కన పెట్టేయడం బెటర్ అని ఫ్యాన్స్ అంటున్నారు.

మగాల గాయం : చెన్నైకి కీలకమైన ఆల్‌రౌండర్ సిసాండ మగాల. రాజస్థాన్‌పై రెండు ఓవర్లు వేసిన అతను కేవలం 14 పరుగులే ఇచ్చాడు. కానీ ఆ తర్వాత ఫీల్డింగ్ సమయంలో అతని చేతికి గాయమైంది. కనీసం రెండు వారాల పాటు అతను ఆటకు దూరం అవ్వాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. దీంతో చెన్నైకి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లు అయింది. అవసరమైతే బ్యాటుతో కూడా రాణించే మగాల ఆ జట్టుకు చాలా కీలకం. కానీ ఇప్పుడు రెండు వారాల పాటు ఆటకు దూరం అవుతున్నట్లు వైద్యులు వెల్లడించిన సంగతి తెలిసిందే.

Story first published: Thursday, April 13, 2023, 10:52 [IST]
Other articles published on Apr 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+