CSKvsRR : రాజస్థాన్ చేతిలో ఓటమి.. చెన్నైకి మరో గట్టి షాక్.. ఆ ప్లేయర్ దూరం!
సొంత మైదానంలో రాజస్థాన్ చేతిలో ఓటమిపాలైన చెన్నైకి మరో షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో చెన్నై స్టార్ ప్లేయర్ గాయపడ్డాడు. దీంతో అతను కనీసం రెండు వారాల పాటు ఆటకు దూరం అవుతున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక కష్టతరమైన క్యాచ్ పట్టే క్రమంలో అతనికి ఈ గాయమైంది.
అతనెవరో కాదు.. సౌతాఫ్రికా యువ సంచలనం సిసాండ మగాల. క్యాచ్ అందుకునే సమయంలో అతని చేతికి తీవ్రమైన గాయమైంది. వేళ్ల మధ్య ఉండే వెబ్బింగ్ దెబ్బతింది. దీంతో అప్పటికప్పుడే అతను మైదానం వీడాల్సి వచ్చింది. ఈ గాయాన్ని పరిశీలించిన వైద్యులు.. కనీసం రెండు వారాలు అతను ఆడటం కుదరదని తేల్చేశారు. దీంతో చెన్నైకి ఇది అతి పెద్ద తలనొప్పిగా మారింది.

ఇప్పటికే గాయంతో బెన్ స్టోక్స్ ఆటకు దూరమైన నేపథ్యంలో చెన్నైకి ఇది మరింత పెద్ద సమస్యగా మారింది. మినీ వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసినా కూడా.. స్టోక్స్ అంత గొప్పగా ఆడలేదు. చెన్నై ఆడిన తొలి రెండు మ్యాచుల్లో బరిలో దిగిన అతను.. పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత మోకాలి గాయం మరింత నొప్పి చేయడంతో బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ఇక చెన్నై చివరగా ముంబైతో ఆడిన మ్యాచ్‌లో కీలక స్పిన్నర్ శాంట్నర్ కూడా గాయంతో కనిపించాడు.
అతని మోకాలి నుంచి రక్తం కారుతున్నా చెన్నై తరఫున అద్భుతంగా ఆడాడీ కివీస్ ప్లేయర్. ఈ గాయం తగ్గేందుకు కూడా కొంత సమయం పట్టేలా ఉంది. ఇప్పుడు మగాలకు కూడా గాయం అవడంతో చెన్నైలో ముగ్గురు కీలక విదేశీ ప్లేయర్లు గాయాల పాలైనట్లు అయింది. వచ్చే మ్యాచుల్లో మగాల బదులు ఎవరిని ఆడిస్తారనేదే ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల సౌతాఫ్రికా తరఫున ఆడిన మగాల.. బంతితో పాటు బ్యాటుతోనూ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications