రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చిత్తుగా ఓడింది. జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ 202 పరుగుల భారీ స్కోరు చేసింది. యశస్వి జైస్వాల్ (77), జోస్ బట్లర్ (27) ఆ జట్టుకు మంచి ఆరంభం అందించారు.చివర్లో ధృవ్ జురెల్ (34), దేవదత్ పడిక్కల్ (27 నాటౌట్) కూడా అదరగొట్టారు. దీంతో రాజస్థాన్ భారీ స్కోరు చేసింది.
లక్ష్య ఛేదనలో చెన్నైకు అనుకున్న ఆరంభం దక్కలేదు. ఫామ్‌లో ఉన్న డెవాన్ కాన్వే (8) విఫలమయ్యాడు. అయితే రుతురాజ్ గైక్వాడ్ (47) ఆకట్టుకున్నాడు. కానీ అతనికి సహకారం అందించే వాళ్లు కరువయ్యారు. అజింక్య రహానే (12), అంబటి రాయుడు (0) దారుణంగా విఫలమయ్యారు. మధ్యలో శివమ్ దూబే (52) చివరి వరకు పోరాడాడు. మొయీన్ అలీ (23), రవీంద్ర జడేజా (23 నాటౌట్) కూడా ఫర్వాలేదనిపించారు.

కానీ చెన్నైని గెలిపించడంలో వాళ్లెవరూ సఫలం కాలేదు. రాజస్థాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. విధ్వంసకర బ్యాటర్లు ఉన్న చెన్నై బ్యాటింగ్ లైనప్‌ను అద్భుతంగా కట్టడి చేశారు. ముఖ్యంగా అశ్విన్, ఆడమ్ జంపా ఇద్దరూ చెన్నై బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. ఫామ్‌లో ఉన్న రహానే, రాయుడు ఇద్దర్నీ అశ్విన్ ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చాడు.
ఈ విజయంపై సంజూ శాంసన్ స్పందించాడు. చివరి మ్యాచ్‌లో ఓటమి తర్వాత ఎలాగైనా ఈ మ్యాచ్ గెలవాలని తమ టీం, సహాయక సిబ్బంది అందరం అనుకున్నామని చెప్పాడు. 'టీం, డగౌట్ అందరూ కోరుకున్న విజయం ఇది. కుర్రాళ్లు జైస్వాల్, దేవదత్, జురెల్ బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతం. ఎవరు బౌలింగ్ చేస్తున్నా ఎటాక్ చేయాలనే మైండ్ సెట్‌ను అందరిలో ఎక్కించడానికి డ్రెస్సింగ్ రూంలో ప్రయత్నిస్తున్నాం' అని చెప్పాడు.
ఈ మైండ్‌సెట్ ఈ మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది. రాజస్థాన్‌లో అవుటైన ప్రతి బ్యాటర్ కూడా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి అవుటైన వాళ్లే. 'అకాడమీలో చాలా కష్టపడే జైస్వాల్ వంటి ఆటగాళ్లకు.. మేనేజ్‌మెంట్, సహాయక సిబ్బంది చాలా మద్దతు ఇస్తున్నారు. ఈ విజయం క్రెడిట్ కచ్చితంగా వారికి దక్కుతుంది. జైస్వాల్ ఇంతలా సక్సెస్ అవడం వెనుక చాలా శ్రమ ఉంది. అతను ఆడుతున్న విధానం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది' అని పేర్కొన్నాడు.