Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSKvsRR : ట్రెంట్ బౌల్ట్ లేని సంజూ సేన.. చెన్నైని మళ్లీ ఓడిస్తుందా?

చెన్నై సూపర్ కింగ్స్‌తో కీలకమైన మ్యాచ్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్‌కు గట్టి షాక్ తగిలింది. ఆ టీంకు బంతితో అద్భుతమైన ఆరంభాలు అందిస్తున్న స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. ఈ విషయాన్ని రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ వెల్లడించాడు. జైపూర్ వేదికగా సీఎస్‌కే, రాజస్థాన్ జట్లు తలపడుతున్న సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సంజూ శాంసన్ తాము ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. పిచ్ చూస్తుంటే బ్యాటింగ్‌కు మంచి సహకారం లభించేలా ఉందని, అందుకే ముందుగా బ్యాటింగ్ చేసి మంచి టార్గెట్ సెట్ చేయాలని అనుకుంటున్నామని చెప్పాడు. ఈ క్రమంలోనే చిన్న గాయం కారణంగా ట్రెంట్ బౌల్ట్ ఈ మ్యాచ్‌లో ఆడటం లేదని, అతని స్థానంలో ఆడమ్ జంపా జట్టులోకి వస్తున్నాడని వెల్లడించాడు.

CSKvsRR :

ఈ క్రమంలో తాను టాస్ గెలిచి ఉన్నా ఛేజింగ్ ఎంచుకునే వాడినని ధోనీ చెప్పాడు. పిచ్ చక్కగా కనిపిస్తున్నా బౌన్స్ సరిగా ఉండేలా కనిపించడం లేదన్నాడు. దీనికి అలవాటు పడేందుకు బౌలర్లకు కొంత సమయం అవసరం అవుతుందని, కాబట్టి ముందుగా బౌలింగ్ చేయడమే కరెక్ట్ అని ధోనీ భావించాడు. తమ జట్టులో ఎలాంటి మార్పులు లేవని, చివరి మ్యాచ్ ఆడిన జట్టుతోనే బరిలో దిగుతున్నట్లు తెలిపాడు.

చెన్నై, రాజస్థాన్ జట్లు చివరగా తలపడినప్పుడు చెపాక్‌లో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు చివరి ఓవర్లో ధోనీ, జడేజా క్రీజులో ఉన్నా కూడా అద్భుతమైన బౌలింగ్‌తో విజయం సాధించింది. ఇప్పుడు కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి.

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజూ శాంసన్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, ధృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జేసన్ హోల్డర్, ఆడమ్ జంపా, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ

చెన్నై సూపర్ కింగ్స్: డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, మొయీన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), మతీష పతిరాణా, తుషార్ దేశ్‌పాండే, మహీష్ తీక్షణ, ఆకాష్ సింగ్

Story first published: Thursday, April 27, 2023, 19:35 [IST]
Other articles published on Apr 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+