Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSKvsLSG : హోం గ్రౌండ్ బెబ్బులి.. చెపాక్‌లో చెన్నై రికార్డు మామూలుగా లేదుగా!

ఐపీఎల్‌లో దాదాపు అన్ని జట్లు తమ హోం గ్రౌండ్‌లో బలంగా కనిపిస్తాయి. కానీ కొన్ని టీమ్స్ మాత్రమే ఆ బలాన్ని విజయాలుగా మార్చుకుంటాయి. అలాంటి వాటిలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. చెపాక్‌లో చెన్నై రికార్డు అద్భుతంగా ఉంది. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా చెన్నై అదరగొట్టింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో చివరకు విజయం మాత్రం చెన్నైనే వరించింది. దీంతో చెపాక్‌లో చెన్నై రికార్డు మరింత మెరుగైంది.

లక్నోతో మ్యాచ్ జరిగే ముందు వరకు చెపాక్‌లో చెన్నై 56 మ్యాచులు ఆడింది. వీటిలో 40 మ్యాచుల్లో చెన్నై జయభేరి మోగించింది. ఇప్పుడు తాజాగా లక్నోపై కూడా విజయం సాధించింది. చెపాక్‌లో చెన్నై విజయాల శాతం 72 శాతంగా ఉంది. మరే జట్టుకు హోం గ్రౌండ్‌లో ఇన్ని విజయాలు సాధించలేదు. ప్రస్తుతం చెపాక్‌లో చెన్నై 57 మ్యాచుల్లో 41 విజయాలు నమోదు చేసింది. అలాగే చెన్నై ఫ్యాన్ బేస్ కూడా భారీగానే ఉంటుంది.

csk chepauk stadium

లక్నోతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (57), డెవాన్ కాన్వే (47), అంబటి రాయుడు (27 నాటౌట్), శివమ్ దూబే (27) అదరగొట్టారు. దీంతో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో లక్నో తడబడింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (20) పెద్దగా ఆకట్టుకోలేదు. దీపక్ హుడా (2), కృనాల్ పాండ్యా (9) కూడా విఫలమయ్యారు. మధ్యలో నికోలస్ పూరన్ (32) పోరాడాడు.

కానీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ఆయుష్ బదోనీ (23) జిడ్డు బ్యాటింగ్ ఆడాడు. దీంతో పుంజుకున్న చెన్నై బౌలర్లు మిగతా ఆటగాళ్లు భారీ షాట్లు ఆడకుండా కట్టడి చేశారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి లక్నో జట్టు 7 వికెట్ల నష్టానికి 205 పరుగులే చేయగలిగింది. దీంతో చెన్నై 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇది ఈ సీజన్‌లో చెన్నైకి తొలి విజయం.

Story first published: Tuesday, April 4, 2023, 16:02 [IST]
Other articles published on Apr 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+