For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSKvsKKR : కేకేఆర్‌కు చావో రేవో.. చెపాక్‌లో చెన్నైని ఓడిస్తుందా?

ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచేందుకు చెన్నై సూపర్ కింగ్స్ రెడీ అవుతోంది. అది జరగాలంటే చెపాక్ వేదికగా జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించాలి. అంతకుముందు ఈ రెండు జట్లు ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో కేకేఆర్‌ను ఏకపక్షంగా ఓడించింది.

ఆ మ్యాచ్‌లో అజింక్య రహానే ధాటిగా ఆడాడు. కేవలం 29 బంతుల్లోనే 71 పరుగులతో అలరించాడు. శివమ్ దూబే, డెవాన్ కాన్వే కూడా రాణించడంతో ఆ మ్యాచ్‌లో చెన్నై 235 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో చెన్నై బౌలర్లు అందరూ చెలరేగారు. దీంతో కేకేఆర్ కేవలం 186 పరుగులు మాత్రమే చేయగలిగింది.

 KKR defeat CSK to be alive in competetion

అయితే ఇంత భారీ స్కోర్లు చెపాక్‌లో నమోదవడం కష్టం. కేకేఆర్ ఇంకా ప్లేఆఫ్స్ పోటీలో నామమాత్రంగానే ఉంది. రాజస్థాన్‌ చేతిలో ఘోరంగా ఓడిపోయిన ఆ జట్టు దాదాపుగా ప్లేఆఫ్స్ రేసులో నుంచి తప్పుకుంది. ఇప్పుడు చెన్నై చేతిలో ఓడితే ఈ జట్టు కూడా ఢిల్లీ బాటలోనే ప్లేఆఫ్స్ రేసు నుంచి పూర్తిగా తప్పుకుంటుంది.

ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిస్తే ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలుస్తుంది. గుజరాత్, చెన్నై మధ్య కూడా కేవలం ఒక్క పాయింట్ తేడా మాత్రమే ఉంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో గెలిస్తే టేబుల్ టాపర్‌గా చెన్నై నిలిచే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ఈ జట్టు మొత్తం మంచి ఫామ్‌లో ఉంది.

పతిరాణా, చాహర్, తుషార్ దేశ్‌పాండే సహా బౌలర్లు అందరూ మంచి టచ్‌లో ఉన్నారు. బ్యాటింగ్‌లో కాన్వే, రహానే, గైక్వాడ్, దూబే కూడా రాణిస్తున్నారు. ఈ క్రమంలో ఈ మ్యాచ్ గెలిచే అవకాశం చెన్నైకే ఎక్కువగా ఉన్నాయి. కేకేఆర్ స్పిన్నర్లు రాణిస్తున్నా.. పేసర్లు అనుకున్న స్థాయిలో బౌలింగ్ చేయడం లేదు.

అలాగే బ్యాటింగ్‌లో కూడా కేకేఆర్ ఎక్కువగా వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్ మీదనే ఆధారపడుతోంది. నితీష్ రాణా కూడా అడపా దడపా ఆడుతున్నాడు. జేసన్ రాయ్, రహ్మనుల్లా గుర్బాజ్ ఆ జట్టుకు సరైన ఆరంభాలు అందించలేకపోతున్నారు. ఈ క్రమంలో చెపాక్‌లో చెన్నై గెలవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే ప్లేఆఫ్స్ రేసు నుంచి కేకేఆర్ దాదాపు తప్పుకున్నట్లే.

Story first published: Sunday, May 14, 2023, 15:55 [IST]
Other articles published on May 14, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+