Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MS Dhoni : ఆ రూల్ వల్ల ధోనీ మరో 2-3 ఏళ్లు ఆడతాడు.. మాజీ లెజెండ్ సలహా!

ఈ ఏడాది ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడే ప్రతి మ్యాచ్‌లో ఫ్యాన్స్ భారీగా తరలివస్తున్నారు. స్టేడియం మొత్తాన్ని పసుపు రంగులో ముంచేస్తున్నారు. ఇదే ధోనీ చివరి ఐపీఎల్ అని వార్తలు వస్తున్న నేపథ్యంలోనే ఫ్యాన్స్ ఎక్కడ మ్యాచ్ జరిగినా భారీగా వస్తున్నారు. తాజాగా కోల్‌కతా నైడ్ రైడ్స్, చెన్నై తలపడిన సంగత తెలిసిందే.

ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ అనంతరం ధోనీ మాట్లాడుతూ.. ఈ ఫ్యాన్స్ అందరూ తనకు ఘనంగా ఫేరెవెల్ సీజని అని వచ్చిన వాళ్లే అన్నాడు. అతను ఈ సీజన్‌లో బ్యాటింగ్ కూడా అద్భుతంగా చేస్తున్నాడు. ప్రస్తుతం అతను ఉన్న ఫామ్‌ కూడా చాలా బాగుంది. ఇదంతా చూసిన కొంత మంది ధోనీ మరో 2-3 సంవత్సరాలు ఐపీఎల్ ఆడితే బాగుంటుందని అంటున్నారు. ఈ జాబితాలో తాజాగా ఆసీస్ లెజెండరీ పేసర్ బ్రెట్ లీ కూడా చేరాడు.

Brett Lee

'సీఎస్‌కే ఎక్కడ ఆడుతున్నా ఫ్యాన్స్ భారీగా వస్తున్నారు. ధోనీకి కేవలం భారత్‌లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. కేకేఆర్, సీఎస్‌కే మ్యాచ్‌లో సగం స్టేడియం పసుపు రంగుతో ఉండటం చూసి చాలా సంతోషంగా అనిపించింది. ధోనీ వంటి ఆటగాడిపై అభిమానులకు ఎంత ప్రేమ ఉందో కనపడుతోంది. అతను ఆడుతున్న విధానం కూడా అదరగొట్టింది. అయితే ఇది ధోనీకి ఫేరెవెల్ ఐపీఎల్ సీజన్ అంటే మాత్రం బ్రెట్‌లీ ఒప్పుకోలేదు. ప్రస్తుతం ఐపీఎల్‌లో కొత్తగా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఈ రూల్ వల్లనే ధోనీ రిటైర్‌మెంట్ ఆలస్యం అవుతుందని, అతను ఇంకొన్నేళ్లు ఆడే ఛాన్స్ ఉందని బ్రెట్‌ లీ అభిప్రాయపడ్డాడు. 'హీరోలు, ఐకాన్స్ వంటి ఈ ఆటగాళ్లు రిటైర్ అవ్వకుండా ఆడుతూనే ఉండాలని మనం కోరుకుంటాం. ఇదే అతని చివరి సీజనో కాదో నాకు తెలీదు. కానీ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల అతను మరో రెండు, మూడేళ్లు ఆడతాడని అనిపిస్తోంది. అతను కనుక ఆడితే అది క్రికెట్‌కు కూడా మంచిదే' అని బ్రెట్ లీ పేర్కొన్నాడు.

Story first published: Tuesday, April 25, 2023, 10:59 [IST]
Other articles published on Apr 25, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+