Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 : ఆ నలుగురు.. గుజరాత్‌ను ఫైనల్ చేర్చిన ఆటగాళ్లు వీళ్లే..!

ఈ ఏడాది ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి సత్తా చాటుతూ.. గత సీజన్‌లో తాము ట్రోఫీ నెగ్గడం లక్కేం కాదని, తమలో అసాధారణ ట్యాలెంట్ వల్లనేనని గుజరాత్ మరోసారి నిరూపించింది. ఈ ఏడాది కూడా బడా బడా జట్లను మట్టి కరిపిస్తూ ఐపీఎల్ లీగ్ దశను టేబుల్ టాపర్‌గా ముగించింది. ఈ విషయంలో కొందరు కీలక ఆగాళ్లు ఆ జట్టుుకు మూల స్తంభాలుగా మారారు. వాళ్లెవరంటే.

శుభ్‌మన్ గిల్: ఈ ఏడాది ఆరంభం నుంచే అద్భుతమైన ఫామ్‌లో ఉన్న గిల్.. ఎన్నో మరుపరాని ఇన్నింగ్సులు ఆడాడు. ముఖ్యంగా లీగ్ చివరి దశలో అయితే విశ్వరూపమే చూపించాడని చెప్పొరు. ప్లేఆఫ్స్‌లో ముంబైపై అద్భుతమైన సెంచరీతో గుజరాత్‌ను ఫైనల్ చేర్చాడు. ఈ ఏడాది ట్రోఫీ నెగ్గగకపోయినా కూడా అయంది. గుజరాత్ ట్రోఫీ నెగ్గకపోయినా 17 మ్యాచుల్లో 890 పరుగులతో ఆరెంజ్ అందుకొని చెలరేగాడు.

gill shami rashid mohit

మహమ్మద్ షమీ: ఈ సీజన్‌లో అదరగొట్టిన మరో గుజరాత్ ప్లేయర్ మహమ్మద్ షమీ. పవర్‌ప్లేలో ప్రత్యర్థి బ్యాటర్లకు కుదురుకునే అవకాశం కూడా ఇవ్వని అతను.. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ జట్టును ముందుకు తీసుకొచ్చాడు. ఫీల్డర్లు, మిగతా ఆటగాళ్ల అండగంతో చెలరేగాడు. అతను 17 మ్యాచుల్లో ఏకంగా 28 వికెట్లు తీసుకొని అలరించాడు.

మోహిత్ శర్మ: లేటుగా ఐపీఎల్‌లో అడుగు పెట్టినా లేటెస్ట్‌గా చెలరేగిన ప్లేయర్ మోహిత్. రిప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా గుజరాత్ జట్టుల చేరిన అతను అద్భుతంగా ఆడాడు. డెత్ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించాడీ బౌలర్. అతను ఆడింది 14 మ్యాచులే అయినా.. ఏకంగా 27 వికెట్లతో ఆకట్టటున్నాడు.

రషీద్ ఖాన్: ఈ ఆఫ్ఘన్ స్పిన్నర్ తన స్పిన్న మాయో ప్రత్యర్థథికి కుదురుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. మిడిల్ ఓవర్లలో కీలకమైన వికెట్లు తీసుకుంటూ గుజరాత్‌ను ముందుకు తీసుకొచ్చాడు. అతను కూడా గుజరాత్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటి వరకు ఆడిన 17 మ్యాచుల్లో 27 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఈ నలుగురే గుజరాత్ ఫైనల్ చేరడానికి కారణం అనడం అతిశయోక్తి కాదు.

Story first published: Tuesday, May 30, 2023, 11:43 [IST]
Other articles published on May 30, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+