Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSKvsGT : వరుసగా రెండు ట్రోఫీలు నెగ్గడం అంత ఈజీ కాదు.. గుజరాత్‌కు చెన్నై కోచ్ వార్నింగ్!

ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ మరో టైటిల్ పోరుకు రెడీ అవుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగే ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఎదుర్కొనేందుకు రెడీ అవుతోంది. ఈ మ్యాచ్‌లో కనుక చెన్నైని ఓడిస్తే వరుసగా రెండు సార్లు టైటిల్ నెగ్గిన టీమ్‌గా గుజరాత్ మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంటుంది.

ఇంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ (2010, 2011) రెండుసార్లు వరుసగా టైటిల్ నెగ్గగా.. ముంబై ఇండియన్స్ కూడా 2019, 2020ల్లో వరుసగా రెండుసార్లు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గింది. ఈ జాబితాలో చేరేందుకు గుజరాత్ వద్ద మంచి అవకాశం ఉంది. అయితే ఇలా బ్యాక్ టు బ్యాటక్ ట్రోఫీలు నెగ్గడం అంత ఈజీ కాదని చెన్నై హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అంటున్నాడు.

CSKvsGT Today IPL Match Winning back to back trophies is impossible says Chennai coach

అదే సమయంలో గుజరాత్ కోచ్ ఆశిష్ నెహ్రా తీరును తెగ మెచ్చుకున్నాడు. చాలా తక్కువ సమయంలోనే నెహ్రా, గుజరాత్ మేనేజ్‌మెంట్ చక్కని జట్టును రెడీ చేశారన్నాడు. అదే సమయంలో వరుసగా ట్రోఫీలు నెగ్గడం మాత్రం అంత ఈజీ కాదన్నాడు. 'అలా గెలవడం దాదాపు అసాధ్యం. చాలా కష్టం. గుజరాత్‌కు కూడా ఇది కష్టమే' అంటూ నవ్వేశాడు.

'గుజరాత్ మంచి జట్టే. ఇంత తక్కువ టైంల మంచి టీంను వాళ్లు రెడీ చేశారు. ఆ టీం కోచింగ్ స్టాఫ్‌ను కూడా నాకు బాగా ఇష్టం. వాళ్ల టీం చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంది' అని మెచ్చుకున్నాడు. 'నెహ్రాకు ఆటపై మంచి పట్టుంది. అతని ఉత్సాహం కూడా చాలా ఎక్కువే. వాళ్లు ఇప్పటి వరకు సాధించిన విజయాలపై మాకు చాలా రెస్పెక్ట్ ఉంది. కానీ బ్యాక్ టు బ్యాక్ నెగ్గడం మాత్రం చాలా కష్టం' అని చెప్పుకొచ్చాడు. మరి గుజరాత్ ఏం చేస్తుందో చూడాలి.

Story first published: Sunday, May 28, 2023, 17:46 [IST]
Other articles published on May 28, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+