ఈ ఏడాది ఐపీఎల్‌లో చెన్నై టీం ఎక్కడ ఆడుతున్నా అక్కడకు ధోనీ ఫ్యాన్స్ క్యూ కట్టారు. ఆయా స్టేడియాలను పసుపు రంగుతో ముంచేశారు. ధోనీ మైదానంలో దిగితే చాలు అతని ఆటను చూసేందుకు ఎగబడ్డారు. జియో సినిమా, హాట్ స్టార్‌లో కూడా ఇదే ట్రెంట్ కనిపించింది.
దీనికి కారణం.. ఇదే ధోనీకి చివరి ఐపీఎల్ అని ప్రచారం జరగడమే. గతేడాది ఐపీఎల్ సందర్భంగా తను తన చివరి మ్యాచ్‌ను చెపాక్‌లో ఆడాలని అనుకుంటున్నట్లు ధోనీ చెప్పాడు అప్పటి నుంచి ఈ సీజన్ ధోనీ లాస్ట్ ఐపీఎల్ అని ప్రచారం జరుగుతోంది. దీంతో అభిమానులు ధోనీ ఎక్కడ ఆడుతుంటే అక్కడకు కోకొల్లలుగా వెళ్లి మద్దతు పలికారు.

అయితే ధోనీ మాత్రం ఇది తన చివరి సీజన్ అని ఎక్కడా చెప్పలేదు. ఎవరైనా ఈ మాట అంటే తను ఇంకా దీనిపై డెసిషన్ తీసుకోలేదని చెప్పాడు. ఇదిలా ఉండగానే అతని కెప్టెన్సీలో అద్భుతంగా ఆడిన చెన్నై ఈసీరా ఐపీఎల్ ఫైనల్‌కు డూరుకెళ్లింది. వర్షం కారణంగా ఆదివారం జరగాల్సిన ఈ మ్యాచ్ రద్దయింది. రిజర్వ్ డే రోజున మ్యాచ్ జరగనుంది.
ఈ సందర్భంగా టీమిండియా మాజీ లెజెండ్ కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీ వయసును కూడా ప్రస్తావించిన అతను.. ఇంకా ధోనీ ఎంతకాలం ఆడాలని ప్రశ్నించాడు. 'అతను 15 సంవత్సరాలుగా ఐపీఎల్ ఆడుతున్నాడు. మనం ఇంకా ధోనీ గురించే ఎందుకు మాట్లాడుతున్నాం? అతను తన పని పూర్తి చేసేశాడు. అతని నుంచి ఇంకా ఏం కావాలి?' అని కపిల్ దేవ్ ప్రశ్నించాడు.
'ఇక జీవితాంతం ధోనీ ఆడుతూనే ఉండాలా? అది జరగదు కదా. దాని కన్నా కూడా 15 సంవత్సరాలు ఆడినందుకు అతనికి రుణపడి ఉండాలి' అని కపిల్ దేవ్ అన్నాడు. వచ్చే ఏడాది ధోనీ ఆడినా ఆడకపోయినా సరే.. వెళ్లిపోయే ముందు ధోనీ అద్భుతంగా ఆడాడని మెచ్చుకున్నాడు. 'అతను భారీ స్కోర్లు చేయకపోయినా కూడా జట్టును ఫైనల్ చేర్చాడు. అదొక్కటి చాలదా క్రికెట్‌లో కెప్టెన్ ప్రాముఖ్యత చెప్పడానికి?' అని అడిగాడు.