Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSKvsGT : చెన్నై టీం.. జూనియర్లతో ధోనీ ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్పిన దీపక్ చాహర్!

ఐపీఎల్‌లో అత్యంత సక్సెస్‌ఫుల్ అయిన టీమ్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. టీమిండియా మాజీ సారధి ధోనీ కెప్టెన్సీలో ఈ టీం చాలా బలంగా ఎదిగింది. ఈ క్రమంలో జట్టు వాతావరణం గురించి ఆ టీం స్టార్ పేసర్ దీపక్ చాహర్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తను టీంలో కొత్తగా చేరినప్పటి విషయాలను చెప్పుకొచ్చాడు.

'నేను కొత్తగా చెన్నై టీంలో చేరినప్పుడు ఒక విషయం గమనించా. టీమ్ డిన్నర్ జరిగే సమయంలో అందరూ రెండు, మూడు టేబుల్స్‌పై కూర్చుంటున్నారు. ఒక టేబుల్‌పై అందరూ సీనియర్లు కూర్చుకున్నారు. ఒక దాంట్లో అందరూ ఓవర్సీస్ ప్లేయర్లు ఉన్నారు. ఇక మా జూనియర్లు అందరం ఒక టేబుల్‌పై కూర్చున్నాం' అని గుర్తుచేసుకున్నాడు.

Deepak Chahar explains their team environment.

'సాధారణంగా జూనియర్ ప్లేయర్లు కనీసం మాట్లాడాలన్నా సిగ్గు పడతాం. అలాంటి టైంలో కూడా మహీ భాయ్ (ధోనీ) ఎప్పుడూ జూనియర్ల ప్లేయర్లతోనే కలిసి కూర్చుంటాడు. అది ఫిక్స్ అంతే' అని చెప్పాడు. అలాగే టీం మేనేజ్‌మెంట్ కూడా ఆటగాళ్లపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాదన్నాడు. 'ఇక్కడ ఏం కావాలన్నా అది ఆప్షనలే. ఏదీ కంపల్సరీ కాదు. ఎవరూ ఏమీ అనరు' అని వెల్లడించాడు.

'వెళ్లి ప్రాక్టీస్ చెయ్, జిమ్ చేయొచ్చు కదా.. వంటి మాటలు ఎవరూ చెప్పరు. నువ్వు ప్రొఫెషనల్ క్రికెటర్ అయినప్పుడు నీకు ఏది మంచిదో అది చేయడం మన బాధ్యత. కావాలంటే ప్రాక్టీస్ చెయ్యి లేదంటే రేపు చెయ్యి. ఇష్టం లేకపోతే అసలు చేయ్యొద్దు. రెస్ట్ తీసుకోవాలంటే రెస్ట్ తీసుకోవచ్చు. అయితే మైదానంలో మాత్రం మంచి పెర్ఫామెన్స్ ఇవ్వాలి. అది అందరికీ తెలుసు' అని టీం మేనేజ్‌మెంట్ గురించి చెప్పాడు.

ఒకవేళ తమ వల్లే మ్యాచ్ ఓడినా సరే మేనేజ్2మెంట్‌లో ఎవరూ ఏమీ అనరని చాహర్ తెలియజేశాడు. 'మహీ భాయ్ కూడా ఒక్క మాట కూడా అనడు. ఈ టీంలో ఎవరిపైనా ఎలాంటి ఒత్తిడి ఉండదు' అని చెప్పుకొచ్చాడు. అలాగే ఐపీఎల్ వల్ల చాలా మంది ఆటగాళ్ల జీవితాల్లో ఆర్థిక భద్రత వచ్చిందని దీపక్ చాహర్ పేర్కొన్నాడు.

Story first published: Sunday, May 28, 2023, 8:40 [IST]
Other articles published on May 28, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+