Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSKvsDC : చెపాక్‌లో ధోనీ సేన చెత్త రికార్డు.. మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తుందా?

ఐపీఎల్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, అట్టడుగున ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడేందుకు రెడీ అయ్యాయి. చెపాక్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో చెన్నై ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో ఢిల్లీకి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే చెపాక్‌లో చివరగా చెన్నై ఆడిన ఐదు మ్యాచుల్లో మూడింట ఓడిపోయింది.

అయితే.. దానికితోడు చివరగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఇదే స్టేడియంలో చెన్నై అద్భుత విజయం కూడా సాధించింది. ఈ విషయం దృష్టిలో పెట్టుకుంటే ఈ మ్యాచ్‌లో కూడా చెన్నై గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకని ఢిల్లీ క్యాపిటల్స్‌ను తక్కువ అంచనా వేయడం కూడా కరెక్ట్ కాదు.

CSK vs DC Match

అంతేకాదు, ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మంచి ఫామ్ అందుకుంది. తాాజగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడింది. ఇప్పటికే ప్లేఆఫ్స్ నుంచి తప్పుకున్న ఈ జట్టు నామమాత్రంగానే పోటీలో ఉంది. అయితే ఇది ఆ జట్టు బెస్ట్ ఆటతీరును బయటకు తెచ్చింది. ఈ క్రమంలో చెపాక్‌లో చెన్నై చెత్త రికార్డును ఢిల్లీ క్యాష్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

అయితే అలా చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఢిల్లీలో ప్రధాన బ్యాటర్లైన మిచెల్ మార్ష్, రైలీ రూసో, ఫిల్ సాల్ట్ ముగ్గురూ స్పిన్‌ను సరిగా ఎదుర్కోలేరు. ఈ బలహీనతను ధోనీ ఈజీగా క్యాష్ చేసుకుంటాడు. దానికితోడు చెన్నైలో జడేజా, తీక్షణ రూపంలో బలమైన ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు.

చెన్నైతో ఆడిన చివరి ఐదు మ్యాచుల్లో మూడుసార్లు ఢిల్లీ విజయం సాధించింది. ఈ మూడుసార్లు ఢిల్లీ ఛేజింగ్ చేసి గెలవడం గమనార్హం. అయితే చెన్నై పరిస్థితులకు ఢిల్లీ జట్టు ఏమాత్రం సరిపోదని చెప్పొచ్చు. చెపాక్ వంటి స్టేడియంలో ఢిల్లీ ప్రధాన బ్యాటర్లు పెద్దగా ఆడకపోవడం కూడా గమనార్హమే.

అదే సమయంలో ఢిల్లీ ప్రధాన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పెద్దగా ప్రభావం చూపడం లేదు. చెన్నై లైనప్‌లో ప్రధాన బ్యాటర్లపై కుల్దీప్ బౌలింగ్‌ ప్రభావం చూపదు. అక్షర్ పటేల్ కూడా మంచి బౌలింగ్ చేస్తున్నా వికెట్లు తీసుకోవడం విఫలమయ్యాడు. నోకియా కూడా జట్టులో లేకపోవడంతో ఢిల్లీ పేస్ బౌలింగ్ కూడా బలహీనంగా మారింది.

మిచెల్ మార్ష్ అడపాదడపా వికెట్లు తీస్తుండటంతో ఆ జట్టు ఎలాగైనా నెట్టుకొస్తోంది. కానీ ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ ముగ్గురూ కూడా ప్రపంచ స్థాయి టీ20 పేసర్లు కాదు. అయితే చెన్నై ఈ విషయంలో కొంత మెరుగ్గా కనిపిస్తోంది. పతిరాణా, దుషార్ దేశ్‌పాండే ఇద్దరూ మంచి ఫామ్‌లో ఉన్నారు.

బ్యాటింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, శివమ్ దూబే, అజింక్య రహానే అద్భుతంగా ఆడుతున్నారు. అంబటి రాయుడు పెద్దగా ప్రభావం చూపకపోయినా.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా అతనిపై ధోనీ సేన బాగా నమ్మకం చూపిస్తోంది. చెన్నై జట్టు ఆటతీరు మొత్తం దెబ్బతింటే తప్ప ఢిల్లీ గెలవడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది.

Story first published: Wednesday, May 10, 2023, 15:13 [IST]
Other articles published on May 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+