CSK: సురేష్ రైనా లేకున్నా.. సమస్య ఏదైనా.. ఎంఎస్ ధోనీ హ్యాండిల్ చేస్తాడు: శ్రీకాంత్

ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ సురేష్ రైనా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో లేకున్నా ఆ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ హ్యాండిల్ చేస్తాడు అని భారత మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. సురేష్ రైనాతో పాటు హర్భజన్ సింగ్ లేకున్నా.. జట్టులో మరే సమస్య ఉన్నా.. మహీనే పరిష్కరించుకుంటాడు అని శ్రీకాంత్ పేర్కొన్నాడు. ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరమవడంపై క్రిస్ శ్రీకాంత్ తాజాగా యూట్యూబ్ షోలో మాట్లాడాడు.

రైనా సేవలను కోల్పోతుంది
'చెన్నై సూపర్ కింగ్స్ ఖచ్చితంగా సురేష్ రైనా సేవలను కోల్పోతుంది. రైనా లేకపోవడం చెన్నై టీమ్‌కు పెద్ద లోటు. ఒక బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా.. మంచి ఫీల్డర్, పార్ట్ టైమ్ బౌలర్, వైస్ కెప్టెన్‌గా ధోనికి అతడు అండగా ఉంటాడు. ఒక్కోసారి ధోనీకి సలహాలు కూడా ఇస్తుంటాడు. జట్టులోనూ ఎనర్జీ నింపడంలో రైనా ముందుండేవాడు. వీటన్నింటినీ చెన్నై కోల్పోనుంది' అని క్రిస్ శ్రీకాంత్ తాజాగా యూట్యూబ్ షో చీకీ చీకాలో అన్నాడు.

సమస్య ఏదైనా ధోనీ హ్యాండిల్ చేయగలడు
'యూఏఈ పిచ్‌లు స్పిన్‌కి అనుకూలించే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి హర్భజన్ సేవలు కోల్పోవడం సీఎస్‌కేకు పెద్ద లోటు. రైనా, హర్భజన్ లేకపోవడం భారీ ఎదురుదెబ్బలే. ఇప్పుడు ఇదంతా ఎంఎస్ ధోనీ చేతిలో ఉంది. అయితే చెన్నై టీమ్‌లో సమస్య ఏదైనా ధోనీ చక్కగా హ్యాండిల్ చేయగలడు. ఎందుకంటే.. ఇదివరకే ఇలాంటి సమస్యలను అతడు ఎన్నోసార్లు అధిగమించాడు. చెన్నైని అద్భుతంగా నడిపించగలడు' అని భారత మాజీ కెప్టెన్ క్రిస్ శ్రీకాంత్ చెప్పాడు. శ్రీకాంత్ భారత్ తరఫున 43 టెస్టులు, 146 వన్డేలు ఆడాడు.

వారి స్థానాల్లో ఎవరినీ తీసుకోలేదు:
ఐపీఎల్ 2020 సీజన్ ముందే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఊహించని షాకులు తగిలాయి. ఆగస్టు 20న అక్కడికి చేరుకున్న చెన్నై జట్టులో 13 మంది కరోనా వైరస్ బారినపడగా.. రిపోర్ట్ వచ్చిన గంటల వ్యవధిలోనే ఐపీఎల్ 2020 నుంచి సురేశ్ రైనా తప్పుకుని భారత్‌కి వచ్చేశాడు. ఇక యూఏఈకి జట్టుతో కలిసి వెళ్లాల్సిన హర్భజన్ సింగ్ కొన్ని రోజులు వేచి చూసి.. వ్యక్తిగత కారణాలతో తాను టోర్నీలో ఆడలేనంటూ తేల్చేశాడు. ఇక సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ స్థానాల్ని ఎవరితో భర్తీ చేయాలనే ఆలోచనలో చెన్నై ఉంది. అయితే రైనా, హర్భజన్ స్థానాల్లో ఇప్పటి వరకూ ఎవరినీ తీసుకోలేదు.

మురళీ విజయ్ లేదా అంబటి రాయుడు
సురేష్ రైనా రెగ్యులర్‌గా ఆడే నెం.3లో మురళీ విజయ్ లేదా అంబటి రాయుడిని ఆడించాలని సీఎస్‌కే జట్టు యాజమాన్యం యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే చివరగా నిర్ణయం తీసుకునేది మాత్రం కెప్టెన్ ఎంఎస్ ధోనీనే. ఇక హర్భజన్ దూరమైనప్పటికీ జట్టులో రవీంద్ర జడేజా, ఇమ్రాన్ తాహిర్, మిచెల్ శాంట్నర్, కర్ణ్ శర్మ రూపంలో నలుగురు స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
ENGvsAUS: చెలరేగిన ఆర్చర్, కరన్.. 207 పరుగులకి ఆస్ట్రేలియా ఆలౌట్.. లెక్కసరిచేసిన ఇంగ్లండ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications