Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK vs SRH: అందుకే అతనిపై వేటు వేశాం- కమిన్స్

ఐపీఎల్‌లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఆర్సీబీ చేతిలో ఓటమి నుంచి తేరుకుని సీఎస్కేపై పైచేయి సాధించాలని ఎస్‌ఆర్‌హెచ్ పట్టుదలతో బరిలోకి దిగుతోంది. చెన్నైను ఓడించి ప్లేఆఫ్స్ ఛాన్స్‌ను మరింత మెరుగుపర్చుకోవాలని భావిస్తోంది.

మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో వరుసగా రెండు ఓటములు చవిచూసిన సీఎస్కే టాప్-4 నుంచి ఆరో స్థానానికి పడిపోయింది. సొంతమైదానంలో తిరిగి గెలుపు బాట పట్టి ప్లేఆఫ్స్‌కు అవకాశాలను సులభతరం చేసుకోవాలని పక్కా ప్రణాళికతో సీఎస్కే ఆడనుంది.

Sunrisers Hyderabad won the toss and chose to field

కాగా, టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తమ తుదిజట్టులో ఓ మార్పు చేశామని తెలిపాడు. అదనపు బ్యాటర్‌తో బరిలోకి దిగాలని భావించి మార్కండే‌ను తప్పించామని చెప్పాడు. ఎల్లప్పుడూ తొలుత బౌలింగ్ చేయాలనుకుంటామని, మ్యాచ్ కొనసాగుతున్న కొద్దీ మంచు ప్రభావం చూపిస్తుందని కమిన్స్ అభిప్రాయపడ్డాడు.

తుదిజట్టు
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నటరాజన్

చెన్నై సూపర్ కింగ్స్: అజింక్య రహానె, డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్, పతిరనా.

Story first published: Sunday, April 28, 2024, 19:24 [IST]
Other articles published on Apr 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+