తొలి బంతికే వికెట్ తీసిన సుందర్
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 4వ ఓవర్‌ను వాషింగ్టన్ సుందర్‌కు ఇచ్చాడు. దీంత్ విలియమ్సన్ నమ్మకాన్ని నిలబెడుతూ మ్యాచ్‌లో వేసిన తొలి బంతికే సుందర్ వికెట్ తీశాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన నాల్గో ఓవర్ తొలి బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసిన సీఎస్కే ఓపెనర్ రాబిన్ ఊతప్ప.. ఫీల్డర్ ఎయిడెన్ మాక్రమ్‌కు దొరికిపోయాడు. దీంతో 25 పరుగుల వద్ద చెన్నై తొలి వికెట్ కోల్పోయింది. అప్పటికి 11 బంతులు ఎదుర్కొన్న ఊతప్ప ఒక ఫోర్ సాయంతో 15 పరుగులు చేశాడు.
యార్కర్‌తో నట్టూ వికెట్
అచ్చం వాషింగ్టన్ సుందర్ తరహాలోనే నటరాజన్ కూడా వేసిన తొలి బంతికే వికెట్ తీసి చెన్నైసూపర్ కింగ్స్‌ను దెబ్బకొట్టాడు. ఆరో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన నటరాజన్ తొలి బంతినే యార్కర్ వేసి అప్పటికే క్రీజులో కుదురుకున్న ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ను ఔట్ చేశాడు. నటరాజన్ వేసిన అద్భుత యార్కర్ దెబ్బకు రుతురాజ్ గైక్వాడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో చెన్నైసూపర్ కింగ్స్ 36 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అప్పటికీ 13 బంతులు ఎదుర్కొన్న రుతురాజ్ గైక్వాడ్ 3 ఫోర్లతో 16 పరుగులు చేశాడు.
13 ఓవర్లు ముగిసే సమమానికి
ఇక 13 ఓవర్లు ముగిసే సమయానికి చెన్నైసూపర్ కింగ్స్ 2 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. మొయిన్ అలీ, అంబటి రాయుడు క్రీజులో ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్ 16, రాబిన్ ఊతప్ప 15 పరుగులు చేసి ఔటయ్యారు. వాషింగ్టన్ సుందర్, టి. నటరాజన్ తలో వికెట్ తీశారు.
తుది జట్లు
చెన్నై సూపర్ కింగ్స్: రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా(కెప్టెన్), శివమ్ దూబే, ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), డ్వేన్ బ్రావో, క్రిస్ జోర్డాన్, మహేశ్ తీక్షణ, ముఖేష్ చౌదరి
సన్‌రైజర్స్ హైదరాబాద్): అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్


Click it and Unblock the Notifications












