Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK vs SRH Toss Update: టాస్ గెలిచిన స‌న్‌రైజ‌ర్స్‌.. హైద‌రాబాద్‌ టీంలో రెండు, చెన్నైలో ఒక మార్పు

CSK vs SRH Toss Update: Sunrisers Hyderabad Won The Toss and Elected to Field First and in SRH Team two Changes

చెన్నైసూప‌ర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో చెన్నైసూప‌ర్ కింగ్స్ మొద‌ట బ్యాటింగ్ చేయ‌నుంది. ఈ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగుతుండ‌గా.. చెన్నై ఒక మార్పుతో బ‌రిలోకి దిగుతుంది. కాగా ఈ సీజ‌న్లో రెండు జ‌ట్లు ఇప్ప‌టివ‌ర‌కు ఒక మ్యాచ్ కూడా గెల‌వ‌లేదు. దీంతో ఈ మ్యాచ్‌లో గెల‌వాల‌ని రెండు జ‌ట్లు ప‌ట్టుద‌లతో ఉన్నాయి.

1
53626

ఈ క్ర‌మంలో సన్‌రైజ‌ర్స్ కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ మాట్లాడుతూ ''మేము ఈ మ్యాచ్‌లో మొదట బౌలింగ్ చేస్తాం. తేమ కార‌ణంగా ముందుగా బౌలింగ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాం. ఈ మ్యాచ్‌లో మేము రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగుతున్నాం. అబ్దుల్ స‌మ‌ద్ స్థానంలో శశాంక్ సింగ్, రొమారియో షెపర్డ్ స్థానంలో మార్కో జాన్సెన్ వచ్చారు. మా ప్ర‌ద‌ర్శ‌న మెరుగ‌వ‌డాన్ని గ‌త గేమ్‌లో చూశాము.'' అని చెప్పాడు.

CSK vs SRH Toss Update: Sunrisers Hyderabad Won The Toss and Elected to Field First and in SRH Team two Changes

ఇక వికెట్‌పై కాస్త పచ్చిక ఉండడంతో టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బౌలింగ్ చేయాల‌నుకున్నామ‌ని చెన్నై కెప్టెన్‌ రవీంద్ర జడేజా చెప్పాడు. అయితే మంచు లేకపోవడం మంచిదైంద‌ని పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో తాము ఒక మార్పుతో బ‌రిలోకి దిగుతున్నామ‌ని చెప్పాడు. డ్వైన్ ప్రిటోరియస్ స్థానంలో మహేశ్ తీక్షణను జ‌ట్టులోకి తీసుకున్న‌ట్లు చెప్పాడు.

తుది జ‌ట్లు
చెన్నై సూపర్ కింగ్స్: రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా(కెప్టెన్), శివమ్ దూబే, ఎంఎస్ ధోని(వికెట్ కీప‌ర్), డ్వేన్ బ్రావో, క్రిస్ జోర్డాన్, మహేశ్ తీక్షణ, ముఖేష్ చౌదరి

సన్‌రైజర్స్ హైదరాబాద్): అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్, నికోలస్ పూరన్ (వికెట్ కీప‌ర్), శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్

Story first published: Saturday, April 9, 2022, 15:59 [IST]
Other articles published on Apr 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+